Nissan X Trail SUV Launch: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న Nissan X Trail SUV వచ్చేసింది. దాదాపు పదేళ్ల తరువాత నిస్సాన్ కంపెనీ ఎక్స్ ట్రయల్ ఎస్ యూవీ లాంచ్ చేసింది. ఇది పూర్తిగా ఇండియాలో ఇంపోర్టెడ్ యూనిట్ కింద రానుంది. Nissan X Trail SUV పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Nissan X Trail SUV Launch: Nissan X Trail SUV ఇండియాలో లాంచ్ అయింది. పూర్తి స్థాయిలో కంప్లీట్ బిల్ట్ యూనిట్‌గా దిగుమతి అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా 4.5 లక్షల యూనిట్లు విక్రయమైన ఈ కారు గత ఏడాది టాప్ 5 SUV గా నిలిచింది. ఈ కారు ధర, ఇతర ఫీచర్లు ఎలా ఉంటాయో ఇప్పుడు పరిశీలిద్దాం.
NISSAN X Trail SUV Price నిస్సాన్ ఎక్స్ ట్రయల్ ముందుగా బుక్ చేసుకుంటే డెలివరీ జరుగుతుంది. ఇప్పటికే 150 యూనిట్లు సిద్ధంగా ఉన్నాయి. మూడు రంగుల్లో లభ్యం కానుంది. భారతీయుల కోసం ప్రత్యేకంగా 7 సీటర్ వెర్షన్ అందుబాటులో ఉంది. ఈ కారు టొయోటా ఫార్చ్యూనర్ కారుకు పోటీ ఇవ్వనుంది. ధర 49.92 లక్షలు ఉంటుంది.
NISSAN X Trail SUV Engine ఇందులో 1.5 లీటర్ 3 సిలెండర్ టర్బో పెట్రోల్ యూనిట్ ఉంటుంది. ఇది 12 వోల్ట్ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ తో అనుసంధానమై ఉంది. 161 బీహెచ్ పి పవర్, 300 ఎన్ఎం టార్క్ జనరేట్ చేయగలదు.
NISSAN X Trail SUV Safety Features ఇందులో సేఫ్టీ కోసం 7 ఎయిర్ బ్యాగ్స్ అమర్చింది కంపెనీ. యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్ ఉన్నాయి.
NISSAN X Trail SUV Interior ఇందులో ప్రీ స్టాండింగ్ టచ్ స్క్రీన్ Infotainment సిస్టమ్ ఉంది. Digital Instrument Cluster, Dual Zone Climate Control, Panoramic Sunroof, Automatic Viper ఉన్నాయి. ఆటో హోల్డ్ ఫంక్షన్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ సిస్టమ్ ఉంటుంది. సెంట్రల్ కన్సోల్ కప్ హోల్డర్, వైర్లెస్ స్మార్ట్ ఫోన్ ఛార్జర్ ఉంది.
NiSSAN X Trail SUV Design ఇండియాలో లాంచ్ చేసిన నిస్సాన్ ఎక్స్ ట్రయల్ ప్రత్యేకమైన గ్రిల్ డిజైన్ కలిగి ఉంది. ఇది 4వ జనరేషన్ మోస్ట్ లుక్రేటివ్ కారు. ముందు భాగంలో Split LED లైటింగ్, ఇన్వర్టెడ్ ఎల్ షేప్ ఎల్ఈడీ డీఆర్ఎల్ ఉంటే వెనుక భాగంలో ఎల్ షేప్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. 20 ఇంచెస్ ఎల్లాయ్ వీల్స్, 2,705 మిల్లీమీటర్ల వీల్ బేస్ ఉంటుంది. ఈ కారు పొడవు 4680 మిల్లీమీటర్లు కాగా వెడల్పు 1840 మిల్లీమీటర్లు ఉంది. ఇక ఎత్తు 1725 మిల్లీమీటర్లుగా ఉంది.