YSRCP Rajya Sabha MPs: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదుర్కొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి త్వరలో మరింత గడ్డు కాలం రాబోతున్నదని తెలుస్తోంది. ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు మూకుమ్మడిగా రాజీనామాలు చేయనున్నట్లు సమాచారం. గతంలో జగన్ అనుసరించిన విధానంలోనే వారు రాజీనామా చేసి అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే లోక్‌సభలో బలం తగ్గగా.. తాజాగా రాజ్యసభలో కూడా ఆ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది.
Also Read: NTR Bharosa: ఏపీలో మళ్లీ పింఛన్ల పండుగ.. ఈసారి ఎన్ని డబ్బులు వస్తాయో తెలుసా?
రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 11 మంది సభ్యులు ఉన్నారు. వారిలో ఆరుగురు ఎంపీలు రాజీనామా చేసే ఆలోచన ఉన్నారు. వైఎస్సార్‌సీపీ రాజ్యసభ పక్షాన్నే కోల్పోయేలా టీడీపీ ప్రణాళికలు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది. రాజీనామా చేసిన అనంతరం వారంతా టీడీపీ కండువా వేసుకోనున్నారని ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read: Chandrababu Srisailam: చెరిగిపోనున్న సీఎం చంద్రబాబు ముద్ర.. అందరి కళ్లు శ్రీశైలం పర్యటనపైనే?
జగన్ పద్ధతిలోనే?
రాజీనామా అనంతరం మళ్లీ తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభ సభ్యత్వం పొందే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మళ్లీ రాజ్యసభ అవకాశం లభించకపోతే మరో రూపంలో వారికి అవకాశాలు ఇవ్వనున్నట్లు సమాచారం. గతంలో ఇదే వ్యూహాన్ని వైఎస్ జగన్ పాటించారు. ఎమ్మెల్సీల విషయంలో జగన్ ఇదే ఫార్ములా ప్రయోగించారు. నాడు ఎమ్మెల్సీగా ఉన్న డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను రాజీనామా చేయించి వైఎస్సార్‌సీపీలో చేర్చుకున్నారు. అనంతరం మళ్లీ ఎమ్మెల్సీ పదవిని అప్పగించారు.
రాజీనామా చేసేది వీరే?
తాజాగా జగన్ పద్ధతిలోనే టీడీపీ ఆ వ్యూహాన్ని అమలు చేయనుంది. కొంచం అటు ఇటుగా అదే సూత్రం చంద్రబాబు పాటించనున్నారని సమాచారం. అయితే రాజీనామా చేసే వారిలో గొల్ల బాబూరావు, ఆర్ కృష్ణయ్య , బీదా మస్తాన్ రావు, మోపిదేవి వెంకట రమణారావుతో పాటు ఇద్దరు ఉన్నారు. అయితే బాబురావు, మస్తాన్ రావ్, మోపిదేవి గతంలో టీడీపీలో పని చేసిన విషయం తెలిసిందే. వారు మళ్లీ రాజ్యసభ స్థానాలను ఆశిస్తున్నారు. గొల్ల బాబూరావు మాత్రం తన కుమారుడికి ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నారు. ఇక మోపిదేవి నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఎమ్మెల్యే సీటు ఆశిస్తున్నారు. అయితే వారు రాజీనామా చేసేందుకు సిద్ధమవగా.. చంద్రబాబు ఆదేశం కోసం వేచి చూస్తున్నట్లు సమాచారం. చంద్రబాబు ఆదేశం అనంతరం ఆరుగురు ఎంపీలు రాజీనామాకు సిద్ధం కానున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook