OPS vs NPS: ప్రస్తుతం ఉద్యోగులు, పెన్షనర్లు పాత పెన్షన్ స్కీమ్‌లో తమకు ఎక్కువ లాభం ఉందని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిజానికి 2004లో కేంద్ర ప్రభుత్వం OPSని నిలిపివేసి దాని స్థానంలో NPSని ప్రవేశపెట్టింది. కొత్తగా ప్రవేశపెట్టిన నేషనల్ పెన్షన్ సిస్టమ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల , పెన్షనర్ల ప్రయోజనాలను దెబ్బ తీస్తోందని, పాత పెన్షన్ విధానంలో గ్యారెంటీ పెన్షన్ విధానం ఉండేదని. కానీ కొత్త పెన్షన్ సిస్టమ్‌లో, పదవీ విరమణ సమయంలో కంపెనీ కంట్రిబ్యూషన్‌తో పాటు బేసిక్ పేలో కొంత భాగం చెల్లించాల్సి ఉంటుందని వాపోతున్నారు.
కొత్త పెన్షన్ విధానం నిలిపివేసి పాత పింఛన్ విధానాన్ని తీసుకురావాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. తాజాగా మోదీ ప్రభుత్వం పాత పెన్షన్ స్కీంపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. తాజాగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ స్కీంను పునరుద్ధరించే యోచనలో ఏదీ లేదని కేంద్ర ప్రభుత్వం తాజాగా పునరుద్ఘాటించింది. ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఇటీవల పార్లమెంట్‌లో ఒక ప్రశ్నకు లిఖిత పూర్వకంగా సమాధానం ఇస్తూ పాత పెన్షన్ విధానం తిరిగి ప్రవేశపెట్టే ఏ ప్రతిపాదన కూడా పరిశీలనలో లేదు అని తేల్చి చెప్పారు.
జూలై 23న తన బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సైతం మాట్లాడుతూ, ఎన్‌పిఎస్‌ను సమీక్షించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ తమ పనిలో మంచి పురోగతి సాధించిందని. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జాతీయ కౌన్సిల్ ఆఫ్ జాయింట్ కన్సల్టేటివ్ బాడీస్ సిబ్బంది నిర్మాణాత్మక విధానాన్ని తీసుకున్నందుకు తాను సంతోషిస్తున్నానని, పెన్షన్ విధానానికి సంబంధించిన సమస్యలకు ఖచ్చితమైన పరిష్కారం లభిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
పాత పెన్షన్ విధానాన్ని పునురుద్ధరించాలని డిమాండ్‌పై పలు అంశాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు ఆర్థిక శాఖ కార్యదర్శి టి.వి.సోమనాథన్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. నిజానికి పాత పెన్షన్ విధానంలో గ్యారెంటీ పెన్షన్ విధానం ఉండేది. కానీ నేషనల్ పెన్షన్ సిస్టమ్‌లో, పదవీ విరమణ సమయంలో కంపెనీ కంట్రిబ్యూషన్‌తో పాటు బేసిక్ పేలో కొంత భాగం చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధానం తమకు సరిపోదని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు చాలా కాలంగా వాదిస్తున్నారు. దీనిపై నేషనల్ కౌన్సిల్ ఆఫ్ జాయింట్ కన్సల్టేటివ్ ఆర్గనైజేషన్స్ (ఎంప్లాయీస్ సైడ్) ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీకి శివగోపాల్ మిశ్రా రాసిన లేఖలో సైతం 14 అంశాలను పేర్కొనగా అందులో ఓల్డ్ పెన్షన్ స్కీం పునరుద్ధరించాలనే డిమాండ్ ప్రధానంగా ఉండటం విశేషం.
Also Read: Paris Olympics 2024: భారత్‌కు శుభవార్త..షూటింగ్లో ఫైనల్ చేరుకున్న మను భాకర్..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter