Brs mla harish rao challenge to congress party on power cut issue: తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు రాజకీయంగా హీట్ ను పుట్టిస్తున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలు నువ్వా.. నేనా.. అన్నట్లు ఒకరిపై మరోకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. హరీష్ రావు మాట్లాడుతూ.. తమ ప్రభుత్వ హాయాలో ఇన్నిసార్లు కరెంట్ కోతలు ఉండేవి కాదని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో రైతులు కరెంట్ కోతల వల్ల తెగ ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీంతో అసెంబ్లీలో బీఆర్ఎస్ , కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్దం మొదలైంది.
🔥🔥🔥 pic.twitter.com/7mmltmSxx7
— Captain Fasak 2.0🎯 (@2Captainparody) July 27, 2024
ఒక నోక సందర్భంలో ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ.. స్పీకర్ ను ఒక పదినిముషాలు టీ బ్రేక్ ఇవ్వాలని, గన్ పార్క్ లేదా అసెంబ్లీ ముందు నిలబడదామని అన్నారు. తెలంగాణ ప్రజానీకానికి ఎవరి పాలనలో ప్రభుత్వం బాగుందా అని అడుగుదామని, కరెంట్ కష్టాల గురించి మాట్లాడుదామని సవాల్ విసిరారు. భట్టన్న.. అంటూనే డిప్యూటీ సీఎంకు, కాంగ్రెస్ నేతలకు హరీష్ రావు సెటైర్ లు వేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇదిలా ఉండగా.. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మారింది. బడ్జెట్ లో తెలంగాణ ప్రభుత్వం అన్నిరంగాలకు సరైన న్యాయం చేయలేదని హరీష్ రావు అన్నారు. బడ్జెట్ సమావేశంలో ఎమ్మెల్యే హరీష్ రావు ఇటీవల గ్రూప్ 2 అంశం, విద్యార్థి నేత గురించి చులకనగా మాట్లాడిన విషయాలను హరీష్ రావు ప్రస్తావించారు. సీఎం స్థాయిలో ఉండి ఇలా మాట్లాడటం సరికాదన్నారు. దీంతో సభలో ఒక్కసారిగా సభ్యులు హరీష్ రావు ప్రసంగాన్ని తప్పుబట్టారు.
బడ్జెట్ గురించి మాట్లాడకుండా.. ఇతర విషయాలు ప్రస్తావించి సభను తప్పుదొవపట్టిస్తున్నారని మండిపడ్డారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బెల్ట్ షాపుల విషయంలో మాట్లాడుతుండగా.. హరీష్ రావు నువ్వోక హఫ్ నాలెడ్జీ అంటూ మండిపడ్డారు. దీంతో కోమటిరెడ్డి కూడా హరీష్ ను.. మనిషివి పెరిగావు.. బుద్ది పెరగలేదంటూ కూడా ఫైర్ అయ్యారు. అదే విధంగా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వంద రోజుల్లో గ్యారంటీలన్నినెరవేరుస్తామని కాంగ్రెస్ పార్టీ బాండ్ ఇచ్చిందని హరీష్ రావు అన్నారు.
Read more: Dream about snakes: కలలో పాములు తరచుగా కన్పిస్తున్నాయా..?.. ఇది మీకోసమే.. అస్సలు మిస్ అవ్వొద్దు..
సోనియా గాంధీతో కూడా చెప్పించారని విమర్శించారు. కానీ ఇప్పటి దాక ఏంచేశారంటూ కూడా హరీష్ రావు నిప్పులు కక్కారు. దీంతో కోమటిరెడ్డి కౌంటర్ ఇస్తు.. గతంలో బీఆర్ఎస్ దళిత ముఖ్యమంత్రి, డబుల్ బెడ్ రూమ్ లు, దళితులకు నాలుగేకరాల భూమి ఇంకా అనేక హమీలు చెప్పి మోసం చేయలేదా అంటూ పంచ్ లు వేశారు. దీంతో సభలో కాంగ్రెస్ , బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్దం నెలకొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి