రివ్యూ: ‘రామ్ ఎన్నారై’(Ram NRI)
నటీనటులు: అలీ రెజా, సీతా నారాయణ్, విజయ్ చందర్, గీతాంజలి, మువ్వా సత్యనారాయణ, సూర్య కుమార్, జోగి నాయుడు, రవి వర్మ తదితరులు..
సినిమాటోగ్రఫీ: నాగబాబు కర్ర
సంగీతం: గోపీ సుందర్
నిర్మాత: మువ్వ సత్యనారాయణ
దర్శకత్వం: ఎన్.లక్ష్మీ నందా
విడుదల తేది: 26-7-2024
తెలుగు బిగ్ బాస్ ఫేమ్ అలీ రెజా ముఖ్యపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘రామ్ NRI’. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదలైంది. మొవ్వా క్రియేషన్స్ బ్యానర్.. SMK ఫిల్మ్ సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎన్ లక్ష్మీ నందా దర్శకత్వం వహించారు.
కథ విషయానికొస్తే..
రామ్ (అలీ రెజా) అమెరికాలో స్థిరపడ్డ ఓ ఎన్నారై. అతని తల్లిదండ్రులు.. శ్రీనివాస్ (మొవ్వా సత్యనారాయణ), సనా అతన్ని పట్టించుకోకుండా.. . తమకు సంబంధించిన బిజీ లైఫ్ తో గడుపుతుంటారు. రామ్ మాత్రం విశ్వభారతి పేరుతో మన భారతీయ సంస్కృతి గురించి తెలియజేసే ఓ సంస్థను నడుపుతుంటాడు. ఈ క్రమంలో అతను తన తాత, నానమ్మలను (విజయ్ చందర్),( గీతాంజలి) కలుసుకోవడానికి మన దేశానికి వస్తాడు. ఈ క్రమంలో ఇక్కడ బ్యాంక్ లో పనిచేసే శ్రావణి (సీతా నారాయణన్) తో ప్రేమలో పడతాడు. ఈ సందర్భంగా అతనికీ తన తల్లిదండ్రులు.. తాత నానమ్మ గురించి ఓ విషయం తెలుస్తుంది. ఈ క్రమంలో అతని జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేదే రామ్ ఎన్నారై స్టోరీ.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
దర్శకుడు లక్ష్మీ నందా ప్రస్తుతం సమాజంలో నడుస్తున్న ఇష్యూను తీసుకొని ఈ సినిమాను తెరకెక్కించడాన్ని అభినందించాలి. ప్రస్తుతం ఎన్నారైలు తమ బిజీ లైఫ్ లో పిల్లలను పట్టించుకోక పోవడంతో వాళ్లు అందరు ఉన్నా అనాథులుగా మారుతున్నారు. పిల్లలకు కేవలం డబ్బు ఇస్తే సరిపోతుందనే కాన్సెప్ట్ తప్పు అని దర్శకుడు ఈ సినిమాలో చూపించాడు. తల్లిదండ్రులు పట్టించుకోని హీరో.. తన మూలాల కోసం తాత, నానమ్మల దగ్గరకు రావడం .. ఇక్కడ ఓ అమ్మాయి అతని జీవితాన్ని ఎలా మార్చిందనే సంఘటనల సమాహారంగా ఈ సినిమాను రూపొందించారు. మొత్తంగా సోషల్ మెసేజ్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించడంలో దర్శకుడు ప్రతిభ కనబడుతుంది. అంతేకాదు సినిమా తీయడేమె కాదు.. ప్రేక్షకులకు ఓ సందేశాన్ని ఇవ్వాలన్న తపన అతనిలో కనిపించింది. ఈ సినిమాను ఎక్కడా రాజీ పడకుండా.. నిర్మించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. శ్రవణ్ సంగీతం ఆకట్టుకునేలా ఉది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఓవరాల్ గా కుటుంబ ప్రేక్షకులను ఈ సినిమా మెప్పిస్తోంది.
నటీనటుల విషయానికొస్తే..
ఈ సినిమాలో అలీ రెజా.. ఎంతో ఈజ్ తో నటించాడు. తన సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోసాడు. హీరోయిన్ గా నటించిన సీతా నారాయణ్ నటన బాగుంది.సీనియర్ నటులు విజయ్ చందర్.. గీతాంజలి తమ నటనతో ఆకట్టుకున్నారు. మిగిలిన పాత్రల్లో నటించిన నటీనటులు తమ పరిధి మేరకు రాణించారు.
రేటింగ్: 2.75/5
ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..
ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter