Astrology: మరికొద్ది రోజుల్లో సూర్య రాశి అయిన సింహంలో గ్రహాల అపూర్వ సమ్మేళనం జరగబోతుంది. ప్రస్తుతం శుక్రుడు కర్కాటక రాశిలో సంచరిస్తూ ఉన్నాడు. ఇది జూలై 31 న సింహరాశిలోకి ప్రవేశిస్తుంది. గ్రహాల రాకుమారుడైన బుధుడు ప్రస్తుతం సింహరాశిలో సంచరిస్తూ ఉన్నాడు. ఇక ఆగస్ట్ 16న సూర్యుడు తనకు సంబంధించిన సింహరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ నేపథ్యంలో బుధుడు, శుక్రుడు, రవి కలయిక వల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడబోతుంది. దీంతో ఏయే రాశుల వారికీ అనుకూలంగా ఉండబోతుందో చూద్దాం..
వృశ్చిక రాశి
బుధుడు, శుక్రుడు మరియు సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశించడం వల్ల వృశ్చిక రాశి వారికి అత్యంత అనుకూలమైన ప్రయోజనాలు కలగనున్నాయి. గ్రహాల రాశి మార్పు మార్పు కారణంగా, ఈ రాశికి చెందిన వ్యక్తులు మతపరమైన కార్యక్రమాలపై ఎక్కువ ఆసక్తిని ప్రదర్శిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. ఖర్చులపై నియంత్రణ అవసరం. ప్రేమ మరియు వ్యక్తిగత జీవితం శృంగారభరితంగా ఉండబోతుంది. కష్ట సమయాల్లో మీరు మీ కుటుంబ సభ్యుల మద్దతు పొందుతారు.
ధనుస్సు రాశి
సింహరాశిలో బుధుడు, శుక్రుడు మరియు రవి గ్రహాల సంచారం ధనుస్సు రాశి వారికి చాలా అనుకూలంగా ఉండబోతుంది. మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి ఇదే సరైన సమయం. ఈ నెలలో మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. కెరీర్ కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. అదే సమయంలో, మీరు మీ భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు.
సింహరాశి
సింహరాశిలో సూర్య, శుక్ర, బుధ గ్రహాల కలయిక వల్ల సింహ రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉండబోతుంది. ఈ సమయంలో మీరు సానుకూలంగా ఉంటారు. చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మతపరమైన కార్యక్రమాల పట్ట అనురక్తి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటాు. అదే సమయంలో పిల్లలతో మంచి సమయాన్ని గడుపుతారు. అంతేకాదు పెళ్లి కానీ యువతి యువకులకు కొత్త బంధంలో ప్రవేశిస్తారు.
పైన పేర్కొన్న అంశాలు కేవలం జ్యోతిష్కులు గ్రహ సంచారం ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీనితో Zee Mediaకి ఎలాంటి సంబందం లేదు.
ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!
ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook