Mosquito Control Tips: ఈ వర్షా కాలంలో అన్నిటికంటే ఎక్కువ దోమల బెడద ఎక్కువ అవుతూ ఉంటుంది. ప్రతి రోజూ సాయంత్రం అయ్యే సరికి.. దోమలతో యుద్ధమే చేయాల్సి వస్తుంది. ఎన్ని దోమలను చంపినా ఏదో ఒకటి అయినా మిగిలే ఉంటుంది. అది మనకి నిద్ర లేకుండా చేస్తుంది. దోమల దాడుల నుండి మనల్ని మనం రక్షించుకోవడం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే దోమల వల్ల మలేరియా, డెంగ్యూ వంటి భయంకరమైన జబ్బుకు వస్తాయి. పిల్లలు ఉన్న ఇల్లు అయితే దోమలను పూర్తిగా అరికట్టాల్సిన అవసరం ఉంది. దోమలను అరికట్టాలి అంటే కొన్ని సహజ మార్గాలు ఫాలో అవ్వాలి. కొన్ని సులువైన పద్ధతులు ఉపయోగించి దోమల నుండి రక్షణ పొందవచ్చు. అవేంటో చూద్దాం.
1. వెల్లుల్లి నీళ్లు:
ఇంట్లో దోమలు ఎక్కువగా ఉండే పరిసరాల్లో ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. విరిచిన వెల్లుల్లి రెబ్బలను నీళ్లలో మరిగించి, ఆ నీటిని చల్లారనివ్వండి. ఈ మిశ్రమాన్ని ఒక స్ప్రే బాటిల్లో పోసి మీ ఇంట్లో స్ప్రే చేయండి. వెల్లుల్లి రసం దోమలను దూరంగా ఉంచుతుంది.
2. దోమల నివారణ మొక్కలు:
మీకు గార్డెన్ ఉన్నా లేదా బాల్కనీ ఉన్నా కూడా ఈ చిట్కా ఉపయోగపడుతుంది. దోమలను దూరంగా ఉంచే మొక్కలు కొన్ని ఉంటాయి. వాటిని నాటండి. మరిగోల్డ్, తులసి, లావెండర్, లెమన్‌గ్రాస్, పెపర్మింట్, రోస్మెరీ వంటి మొక్కలు ఈ కోవకి చెందుతాయి. ఈ మొక్కలు దోమలపై ప్రభావం చూపుతాయి కానీ మనకు హాని కలిగించవు.
3. నిమ్మకాయ - లవంగాలు:
మీ గదిలో దోమలు రాకుండా చూడడానికి ఈ సులభమైన పద్ధతిని ఉపయోగించవచ్చు. ఒక నిమ్మకాయను సగం కోయండి, అందులో కొన్ని లవంగాలను పెట్టి, మీ గదిలో వివిధ ప్రదేశాలలో ఉంచండి. దాని నుండి వచ్చే సుగంధం దోమలను దూరంగా ఉంచుతుంది.
4. లూజ్ బట్టలు:
దోమలను నివారించడానికి, చేతులు, కాళ్ళు కవర్ అయ్యేలగా బట్టలు వేసుకోవాలి. పెర్మేత్రిన్-ట్రీటెడ్ బట్టలు ఉపయోగించడం ఇంకా మంచిది.
5. శుభ్రమైన పరిసరాలు:
మన ఇంటిని మనం శుభ్రంగా ఉంచుకుంటే దోమలను నివారించవచ్చు. పైగా వర్షా కాలం కాబట్టి తడి బట్టలను ఒకే దగ్గర పేర్చేయడం, ఇల్లు చెమ్మగా లేకుండా చూసుకోవడం, అన్నీ నీట్ గా సర్దుకోవడం వంటివి చేస్తే దోమల రాకుండా చూసుకోవచ్చు.
ఈ సహజ పద్ధతులు ఉపయోగించి . మన ఇంటిని దోమల నుండి రక్షించుకోవచ్చు. దోమల నుండి మన ఇంటిని మనం కాపాడుకుంటే.. రోగాల నుండి మన శరీరాన్ని మనం కాపడుకున్నట్టే.
Also Read: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..
Also Read: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook