Tragic Incident: దిగ్భ్రాంతికర సంఘటన.. పిల్లల కోసం ఉరితో ఆటలాడుతూ తండ్రి దుర్మరణం

Father Dies Playing With Suicide At Visakhapatnam: తన పిల్లల కోసం ఆటలాడించేందుకు ఆ తండ్రి చేసిన ప్రయత్నం అతడి ప్రాణాలనే తీసింది. ఊహించని రీతిలో జరిగిన ఈ సంఘటన ఏపీలో చోటుచేసుకుంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jul 19, 2024, 09:54 PM IST
Tragic Incident: దిగ్భ్రాంతికర సంఘటన.. పిల్లల కోసం ఉరితో ఆటలాడుతూ తండ్రి దుర్మరణం

Visakha Tragic Incident: అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పిల్లల కోసం ఓ తండ్రి ఆట పట్టించే ప్రయత్నం చేశాడు. వారితో ఆటలాడుకుంటూ సరదాగా గడుపుతున్నాడు. అయితే పిల్లల అల్లరి శ్రుతిమించింది. పిల్లల అల్లరిని కట్టడి చేసేందుకు.. వారిని బెదిరించేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. అతడి ప్రాణాలే పోయాయి. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: Urvashi Rautela: హాట్ హీరోయిన్‌ వీడియో లీక్‌.. బాత్రూమ్‌లో బట్టలు విప్పుతూ..

 

విశాఖపట్టణం జిల్లా గోపాలపట్నంలో బిహార్‌కు చెందిన చందన్ కుమార్ (33) రైల్వేలో సీనియర్ అసిస్టెంట్ లోకోపైలట్. ఐదేళ్ల నుంచి గోపాలపట్నంలోని 89వ వార్డు కొత్తపాలెంలో కుటుంబంతో కలిసి నివసించేవాడు. అతడికి భార్య, కుమార్తె (7), కుమారుడు (5) ఉన్నారు. అయితే బుధవారం (జూలై 17) రాత్రి చందన్‌ కుమార్‌ చొక్కా జేబులోని కరెన్సీ నోట్లను పిల్లలు తీసి చించేశారు. డబ్బులను చించేసిన పిల్లలపై తండ్రి కోప్పడ్డాడు.

Also Read: Telangana Police: అమ్మనా బూతులతో రెచ్చిపోతున్న తెలంగాణ పోలీసులు.. కేటీఆర్‌, నెటిజన్లు ఆగ్రహం

అయితే పిల్లలను దూషించడంతో భార్య అడ్డుపడి భర్తతో వాగ్వాదానికి దిగింది. ఈ సమయంలో భార్యాభర్తల మధ్య చిన్న గొడవ జరిగింది. అయితే అల్లరితో తనకు ప్రశాంతత లేకుండా చేస్తే తాను చచ్చిపోతానని చందన్‌ కుమార్‌ బెదిరింపులకు దిగారు. ఆత్మహత్య చేసుకుంటానని చెప్పినా పిల్లలు వినిపించుకోలేదు. దీంతో ఆయన ఇంట్లోని ఫ్యాన్‌కు చీర కట్టి ఉరి కట్టాడు. ఉరిని మెడకు చుట్టుకుని కుటుంబసభ్యులను నేను చచ్చిపోతా అంటూ భయపెట్టే ప్రయత్నం చేశారు.

ఇది పిల్లలు, భార్య పట్టించుకోలేదు. అయితే ఇంతలో పొరపాటున మెడకు వేసుకున్న ఉరి బిగుసుకుపోయింది. ఊపిరాడక విలవిలలాడాడు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న భర్తను కాపాడేందుకు భార్య తీవ్రంగా ప్రయత్నించింది. కానీ ఆమె ఒంటరిగా కష్టపడడంతో భర్త ప్రాణం అప్పటికే పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఇంటిని పరిశీలించారు. మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News