AP Weather Forecast: ఏపీలో వర్షాలు విస్తృతంగా పడుతున్నాయి. రానున్న మూడ్రోజులు కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బంగాళాఖాతంలో సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తువలో కోస్తాంధ్ర-పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారనుంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు బలంగా కదులుతున్నాయి. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఆవర్తనం పశ్చిమ బెంగాల్, జార్ఘండ్, ఒడిశా వరకూ విస్తరించి ఉంది. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ హెచ్చరించింది. రైతులు, కూలీలు పొలాల్లో, చెట్ల కింద, విద్యుత్ స్థంభాల కింద తిరగవద్దని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది. ఏపీలో భారీ వర్షాలు పొంచి ఉండటంతో తగిన జాగ్రత్తలు తీసుకోవల్సిందిగా అధికారుల్ని అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజల విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఐఎండీ సూచనల ప్రకారం కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి.
రేపు మంగళవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షసూచన ఉంది. దక్షిణ కోస్తాంధ్రలో మోస్తరు వర్షాలు పడనున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో రేపు, ఎల్లుండి అతి భారీ వర్షాలు పడవచ్చు. ఏపీలోని పార్వతీపురం మన్యం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, నెల్లూరు, కర్నూలు, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి.
ఇక అనకాపల్లి, కాకినాడ, గుంటూరు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, బాపట్ల, అనంతపురం, కడప జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చు.
Also read: Uric Acid: యూరిక్ యాసిడ్ ఎప్పుడు పెరుగుతుంది, ఆర్ధరైటిస్‌కు దారి తీస్తుందా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook