SSY Calculator: మన దేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలు ఉన్నాయి. అయితే, వీటితో ప్రజలకు ఎంతో కొంత లాభాన్ని చేకూర్చేవి అధికం. అయితే, ఈరోజు మనం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన సుకన్య సమృద్ధి యోజన గురించి తెలుసుకుందాం.
సుకన్య సమృద్ధి యోజన దీన్ని 2015 లో ప్రారంభించారు. పదేళ్లలోపు బాలికల పేరుపై ఖాతాను ఓపెన్ చేస్తే కేంద్ర ప్రభుత్వం 8.2 శాతం వడ్డీ అందిస్తుంది. ప్రతి ఒక్కరూ ఎంతో కొంత డబ్బును ఆదా చేయాలనుకుంటారు. ఎందుకంటే పదవీ విరమణ తర్వాత లేదా పిల్లల పెళ్లి, చదువులకు అవి ఉపయోగపడతాయని ఇలా చేస్తారు. అయితే, ఈ డబ్బులను ఎక్కడ పెట్టుబడి పెడితే భద్రంగా ఉంటుంది. గ్యారెంటీ రిటర్న్ వస్తాయో అనే సందిగ్ధంలో కూడా ఉంటారు. వారికోసమే కొన్నిరకాల ప్రభుత్వ స్కీములు ఉన్నాయి. అందులో ఒకటి సుకన్య సమృద్ధి యోజన
8.2 శాతం వడ్డీ.. సుకన్య సమృద్ధి యోజన ప్రతి మూడు నెలలకు ఈ వడ్డీ రేటులో మార్పులు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం సుకన్య సమృద్ధి యోజన పథకంలో 8.2 శాతం వడ్డీ ఇస్తున్నారు. ఇందులో గరిష్ట సమయంలో పెట్టుబడులు పెడితే మీ కూతురు మిలీయనర్స్ అవుతారు.
సుకన్య సమృద్ధి యోజనలో మీ కూతురు ఐదేళ్లు ఉన్నప్పుడు ఈ ఖాతాను తెరిస్తే బాలిక 21 ఏళ్లు వచ్చే సరికి ఖాతాలో 69 లక్షలు జమా అవుతాయి. అంటే ప్రతి ఏడాది 1.5 లక్షలు జమా చేస్తే 21 ఏళ్లు వచ్చేసరికి రూ. 22,50,000 జమా అవుతే, దీనిపై వడ్డీరేటు 8.2 శాతం వడ్డీ అందితే రూ. 46,77,578 వస్తుంది. మీ అమ్మాయి 21 ఏళ్లు వచ్చేసరికి రూ. 69,27,578 వస్తాయి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ పథకంలో మీరు కనీసం రూ. 250 ద్వారా ప్రారంభించవచ్చు. ఈ పథకంపై ఎలాంటి ట్యాక్స్ ఉండదు. ఇది సెక్షన్ 80 సీ ప్రకారం ట్యాక్స్ వెసులుబాటు ఉంటుంది. ఏ విధమైన ట్యాక్స్ ఉండదు.
సుకన్య సమృద్ధి పథకాన్ని ప్రారంభించడానికి భారతీయులై ఉండాలి. బాలిక తల్లిదండ్రులు లేదా గార్డియన్స్ ప్రారంభించాలి. పదేళ్లలోపు ఉన్న అమ్మాయిలపై ఓపెన్ చేయాలి. ఇంట్లో ఇద్దరు కూతుళ్లు ఉన్నా ఓపెన్ చేయవచ్చు. పూర్తి జమా అయిన డబ్బులు మీ పాప 18 ఏళ్లు కనీసం దాటే వరకు తీసుకోకూడదు. చదువు నిమిత్తం 50 శాతం విత్డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది.