Nashik bus accident video viral: కొన్నిరోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో టూరిస్టులు కొత్త ప్రాంతాలకు వెళ్లడానికి ఆసక్తి చూపిస్తుంటారు. చాలా మంది తమ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ తో కొత్త ప్రదేశాలకు వెళ్తుంటారు. జలపాతాలు, అడవులు, సముద్రాల దగ్గరకు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో.. కొన్నిసార్లు విహర యాత్రలు కాస్త విషాద యాత్రలుగా మారుతుంటాయి. సెల్ఫీల పిచ్చిలో పడి, రీల్స్ లకు అడిక్ట్ కావడం వల్ల కొన్నిసార్లు ఊహించని ఘటనలు జరుగుతుంటాయి. సెకన్ల వ్యవధిలో కొన్నిసార్లు దారుణమైన ఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
లైవ్ ఆక్సిడెంట్ వీడియో.. లోయలో పడిన బస్సు
మహారాష్ట్ర - నాసిక్‌లోని సాత్పురా ఘాట్ వద్ద ఓవర్‌టేక్ చేసే క్రమంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో లోయలో పడ్డ బస్సు.. ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, 58 మందికి గాయాలయ్యాయి. pic.twitter.com/ZeXXyLWtwQ
— Telugu Scribe (@TeluguScribe) July 9, 2024
గుజరాత్‌లోని డాంగ్ జిల్లాలో సాత్పురా ఘాట్ వద్ద టూరిస్ట్ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన.. ఆదివారం సాయంత్రం (జూలై 7) చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మైనర్లు మరణించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన జరుగుతున్నప్పుడు.. వెనుక సీట్లు కూర్చుని ఉన్న టూరిస్టు వీడియో తీస్తున్నాడు. ఇంతలో బస్సు లోయలోకి జారిపోయింది. ట్రక్కును ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో బస్సు డ్రైవర్ తన బ్యాలెన్స్ కోల్పోవడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది.బస్సులోయలో పడిపోతుండగా.. ప్రయాణికులు భయంతో కాపాడండి.. అంటూ గట్టిగా అరుస్తున్న అరుపులు కూడా ఆ వీడియోలో రికార్డు అయ్యాయి.
చూస్తుండగానే. బస్సు లోయలోనికి జారీపోయింది. బస్సులో 70 మంది ప్రయాణికులు ఉండగా, వారంతా గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన వారని సమాచారం. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, 58 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవల కోసం దగ్గరలోని ఆస్పత్రులకు తరలించారు.
Read more: Anshuman singh Wife: అమరుడి భార్యపై అసహ్యమైన కామెంట్లు.. తీవ్రంగా స్పందించిన మహిళ కమిషన్..
ఇదిలా ఉండగా.. నాసిక్ జిల్లా సరిహద్దులో ఉన్న పర్యాటక ప్రదేశం సాత్పురాను చూడటానికి పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. వర్షకాలంలో టూరిస్టుల తాకిడి మరీ ఎక్కువగా ఉంటుంది. ఈ ఘటన మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్నిచూసిన నెటిజన్లు బాబోయ్.. అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం.. వీళ్లంతా బతికే ఉన్నారా.. వీడియో చూస్తేనే భయంకరంగా ఉందంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి