YS Jagan Mohan Reddy: అధికారంలో ఉన్నా లేకపోయినా అన్న అంటే పలుకుతాడు. ఆపదంటే వెంటనే స్పందిస్తాడనే పేరు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉంది. ఎన్నికల్లో ఘోరంగా ఓటమిని చవిచూసిన జగన్ ప్రస్తుతం తన సొంత నియోజకవర్గం పులివెందులపైనే ప్రత్యేక దృష్టి సారించారు. అధికారం కోల్పోయిన తర్వాత రెండో సారి పులివెందులలో పర్యటిస్తున్న జగన్ ఈ సందర్భంగా మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రమాదానికి గురయిన ఓ యువకుడిని కాపాడారు.
Also Read: YS Jagan Sharmila: ఒకే వేదికపై వైఎస్ జగన్, షర్మిల.. ఆరోజు ఏం జరగబోతున్నది?
తన తండ్రి వైఎస్సార్ 75 జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు వైఎస్ జగన్ కడప జిల్లాకు చేరుకున్న విషయం తెలిసిందే. తన పులివెందుల నియోజకవర్గంలో రెండు రోజులుగా పర్యటిస్తున్నారు. లింగాల మండలం పెద్ద కుడాలలో ఆదివారం జగన్ పర్యటించారు. ఈ సమయంలో కోమన్నూతల గ్రామానికికు చెందిన నరేంద్ర అనే యువకుడు మద్యం మత్తులో నీటిలో పడి ప్రాణాపాయ స్థితిలోకి చేరుకున్నాడు. దీంతో పక్కనే ఉన్న సన్నిహితులు 108 వాహనానికి ఫోన్ చేసినా సకాలంలో రాకపోవడంతో ద్విచక్ర వాహనంపై పులివెందులలోని ఆసుపత్రికి తరలిస్తున్నారు.
Also Read: YSR Birth Anniversary: ఎవరికీ తెలియని వైఎస్సార్‌కు సంబంధించిన ఈ 10 ముఖ్యమైన విషయాలు తెలుసా?
ఇదే సమయంలో పెద్ద కుడాలలో మాజీ ఎంపీపీ కుటుంబాన్ని పరామర్శించి వైఎస్ జగన్ తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో చిన్న కుడాల గ్రామస్తులతో మాట్లాడేందుకు ఆగారు. ఈ సమయంలో ద్విచక్ర వాహనంపై ప్రాణపాయ స్దితిలో ఉన్న యువకుడు నరేంద్రను తరలిస్తున్న విషయాన్ని జగన్ గమనించారు. వెంటనే తన కాన్వాయ్‌లో ఉన్న 108 వాహనంలో ఆ యువకుడిని ఆస్పత్రికి తరలించేలా జగన్ ఏర్పాట్లు చేశారు.
కాన్వాయ్‌లోని 108 అంబులెన్స్ ద్వారా బాధితుడు నరేంద్రను హుటాహుటిన ఆక్సిజన్ సహాయంతో పులివెందులలోని మెడికల్ కళాశాలకు తరలించారు. వెంటనే వైద్యులు చికిత్స అందించడంతో నరేంద్ర ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం నరేంద్ర కోలుకుంటున్నాడు. ఆపత్కాలంలో వైఎస్ జగన్ స్పందించడంతో అతడి ప్రాణాలు దక్కాయని నరేంద్ర స్నేహితులు, కుటుంబసభ్యులు ఈ సందర్భంగా జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కాగా అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్ ఇలాగే మానవత్వం ప్రదర్శించారు. తన పర్యటనల్లో ఇప్పటికే అనేకసార్లు 108కు ట్రాఫిక్ క్లియర్ చేసి దారి ఇచ్చి అనేక మార్లు ప్రాణాలు కాపాడారు. కాగా వైఎస్సార్ జయంతి సందర్భంగా సోమవారం జగన్ ఇడుపులపాయను సందర్శించనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి