న్యూఢిల్లీ: గోవా సీఎం మనోహర్ పారికర్ (63) ఇక లేరు. గత ఏడాది ఫిబ్రవరి నుంచి క్లోమ గ్రంథి క్యాన్సర్ (ప్యాన్‌క్రియాటిక్ క్యాన్సర్) వ్యాధితో బాధపడుతున్న ఆయన ఇవాళ సాయంత్రం తుది శ్వాస విడిచారు. గతేడాది క్లోమ గ్రంథి క్యాన్సర్ వ్యాధి ఉందని నిర్ధారణ అయినప్పటి నుంచి గోవా, ముంబై, ఢిల్లీ, న్యూయార్క్‌లోని ఆస్పత్రులలో చికిత్స తీసుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది.
మనోహర్ పారికర్‌కి క్లోమ గ్రంథి క్యాన్సర్ వ్యాధి సోకిందని నిర్ధారించినప్పటికే అది అడ్వాన్స్ దశలో వుంది. ప్యాన్‌క్రియాటిక్ క్యాన్సర్ వ్యాధి అడ్వాన్స్ దశలో వుందని గుర్తించిన అనంతరం చికిత్స పొందినా బతికే అవకాశాలు తక్కువే అని నిపుణులు చెబుతున్నారు.