YS Rajasekhara Reddy: ఆరేళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జూలై 8వ తేదీ వైఎస్సార్ జయంతి. ఈ సోమవారం 75వ జయంతి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్‌లో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. 8 జూలై 1949లో జన్మించిన వైఎస్సార్ యుక్త వయసులోనే రాజకీయాల్లో ప్రవేశించి విద్యార్థి నాయకుడిగా రాణించారు. అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యే, మంత్రిగా, ఎంపీగా విజయం సాధించినా ముఖ్యమంత్రి పదవి మాత్రం ఆలస్యంగా వచ్చింది.
Also Read: YS Jagan Sharmila: ఒకే వేదికపై వైఎస్ జగన్, షర్మిల.. ఆరోజు ఏం జరగబోతున్నది?
కాంగ్రెస్ పార్టీలో అగ్ర నాయకుడిగా వెలుగొందిన వైఎస్సార్ ముఖ్యమంత్రి ఆరేళ్లు పరిపాలించి ఘోర ప్రమాదంలో మృతి చెందారు. పులివెందుల నుంచి మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం పావురాల గుట్టలో ముగిసింది. 75వ జయంతి సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోపాటు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇడుపులపాయలోని వైఎస్సార్ సమాధి వద్ద మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతోపాటు వైసీపీ, కాంగ్రెస్ నాయకులు నివాళులర్పించనున్నారు.
Also Read: YS Jagan Case: మాజీ సీఎం వైఎస్ జగన్‌కు భారీ ఎదురుదెబ్బ.. త్వరలోనే జైలుకు?
వైఎస్సార్ జయంతి సందర్భంగా ఆయనకు సంబంధించిన అతి ముఖ్యమైన పది అంశాలు తెలుసుకోండి.
- పదేళ్లు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) వైఎస్సార్‌కు మంచి స్నేహితుడు. వైఎస్సార్ తొలిసారి ముఖ్యమంత్రి అయిన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో నాటి టీఆర్‌ఎస్ (బీఆర్‌ఎస్) పార్టీ భాగంగా ఉంది. ఆ తర్వాత బయటకు వచ్చింది.
- వైఎస్సార్‌కు తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆత్మీయ స్నేహితుడు. వీరిద్దరూ నాడు కాంగ్రెస్ పార్టీలో కలిసి పని చేశారు.
- ప్రత్యక్ష ఎన్నికల్లో ఏడు సార్లు వైఎస్సార్ గెలిచారు. లోక్‌సభకు నాలుగు సార్లు, మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
- భారతదేశంలోనే అప్పటివరకు ఎవరూ చేపట్టని సాహసయాత్ర వైఎస్సార్ చేశారు. 2003లో 1,500 కిలో మీటర్ల సుదీర్ఘ యాత్ర చేపట్టారు.
- ఐదుగురి సంతానంలో వైఎస్సార్ పెద్దవారు. వైఎస్సార్‌కు నలుగురు తమ్ముళ్లు ఉన్నారు.
- వైఎస్సార్ తండ్రి రాజారెడ్డి బాంబు దాడిలో మరణించారు.
- వైఎస్సార్ పుట్టు క్రైస్తవ కుటుంబంలో పుట్టారు. చర్చిలను సందర్శిస్తూనే పరమత సహనం పాటించేవారు. హిందూ, ముస్లిం సంప్రదాయాలను కూడా గౌరవించారు.
- నల్లమల్ల అటవీ ప్రాంతంలో వాతావరణం అనుకూలించక 2 సెప్టెంబర్ 2009లో మరణించాడు. ఆయన మరణించి 15 ఏళ్లు అయినా ఏపీలో ఆయనను ఇంకా మరువలేదు.
- ముఖ్యమంత్రిగా వైఎస్సార్ అమలు చేసిన ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్య శ్రీ, ఉచిత విద్యుత్ వంటివి నేటికీ అమలు చేస్తున్నారు.
- వైఎస్సార్ ఎప్పుడు పంచెకట్టులో తెలుగుదనం కట్టిపడేసేలా ఉండేవారు. వైఎస్సార్ రైతు, వైద్యుడిగా గుర్తింపు పొందారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి