Clove Tea Benefits: లవంగం టీ లాభాలు మెండు.. ఇలా తాగితే అందం ఆరోగ్యం..

Clove Tea Benefits: లవంగంలో సహజసిద్ధమైన ఫ్యాటీ యాసిడ్స్‌ ఉంటాయి. లవంగం తీసుకోవడం వల్ల బెల్లీఫ్యాట్‌ కూడా తగ్గిపోతుంది. దీంతో బరువు, కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.  లవంగం టీ లో యాంటీ బ్యాక్టిరియల్ గుణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

Written by - Renuka Godugu | Last Updated : Jul 2, 2024, 02:38 PM IST
Clove Tea Benefits: లవంగం టీ లాభాలు మెండు.. ఇలా తాగితే అందం ఆరోగ్యం..

Clove Tea Benefits: లవంగం మన వంటగదిలో నిత్యం అందుబాటులో ఉండే వస్తువు. ఇది దీసుకోవడం వల్ల రొంప సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. లవంగం నూనెను వివిధ వంటకాల్లో మనం వినియోగిస్తాం. ముఖ్యంగా ఇందులో యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు పుష్కలంగా ఉంటాయి. లవంగం టీ తో జీర్ణ సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఇది అజీర్తి, కడుపులో ఉబ్బరం సమస్యకు చెక్ పెడుతుంది. లవంగం టీ లో యాంటీ బ్యాక్టిరియల్ గుణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

జీర్ణక్రియ..
లవంగం టిక్కెట్‌ తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్‌ సమస్యలు మన దరిచేరవు. ముఖ్యంగా అల్సర్‌ వంటి సమస్యలకు చెక్‌ పెడుతుంది. కడుపులో అల్సర్‌ సమస్యలు రాకుండా నివారిస్తుంది. మంచి జీర్ణక్రియకు తోడ్పడుతుంది. లవంగం టీ తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే లవంగంలో ఫైబర్‌ ఉంటుంది.

ఇదీ చదవండి: వారానికి ఒక్కసారైనా ఈ కూరగాయ తినండి.. మీ గుండె ఉక్కులా మారుతుంది..

బరువు తగ్గుతారు..
లవంగంలో సహజసిద్ధమైన ఫ్యాటీ యాసిడ్స్‌ ఉంటాయి. లవంగం తీసుకోవడం వల్ల బెల్లీఫ్యాట్‌ కూడా తగ్గిపోతుంది. దీంతో బరువు, కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. 

ఆరోగ్యకరమైన కాలేయం..
లవంగంలో యుగేనల్‌ ఉంటుంది. ఇవి యూరిక్‌ యాసిడ్‌ సమస్యకు ఎఫెక్టీవ్‌గా పనిచేస్తుంది. అంతేకాదు ఇందులో యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇది లివర్‌ సిర్రోసిస్‌ ఆక్సిడేటీవ్‌ స్ట్రెస్‌ నుంచి కాపాడుతుంది. లవంగంలో ఉండే సెల్స్‌ కాలేయ ఆరోగ్యాన్ని మెరుగు చేస్తాయని ఎన్‌ఐహెచ్ నివేధిక తెలిపింది.

ఇదీ చదవండి: బ్రెస్ట్‌ క్యాన్సర్‌ స్టేజ్‌- 3 అంటే ఏమిటి? లక్షణాలు, చికిత్సలు ఏముంటాయి..?

టెస్టోస్టిరన్‌ స్థాయిలు..
లవంగంలో టెస్టోస్టీరన్‌ స్థాయిలు, టెస్టికల్‌ మెరుగైన పనితీరుకు సహాయపడుతుంది. ఎందుకంటే ఇవి ఎక్కువైతే ఫెర్టిలిటీ సమస్యలు కూడా రావచ్చు.

కేన్సర్‌..
లవంగంలో ఉండే యుగేనల్‌ కేన్సర్‌ సమస్యను నివారిస్తుంది. ట్యూమర్‌ అభివృద్ధి కాకుండా నివారిస్తుంది. ముఖ్యంగా లవంగాలు బ్రెస్ట్‌ కేన్సర్‌ సెల్స్‌ పెరగకుండా కాపాడుతుంది. లవంగం మంట సమస్యకు చెక్‌ పెట్టి కేన్సర్‌కు కణాల ఉత్పత్తికి వ్యతిరేకంగా పోరాడుతుంది. బ్రెస్ట్‌ కేన్సర్‌ సమస్యలు ఉన్నవారు లవంగం వాడాలి. ఇది కణాల అభివృద్ధి కాకుండా నివారించడంలో లవంగం టీ సహాయపడుతుంది.

ఎముక ఆరోగ్యం..
ఎండిన లవంగంలో హైడ్రోఆల్కహాలిక్‌ లో మ్యాంగనీస్‌, పాలీఫెనల్స్‌ కూడా ఉంటాయి ఈ రెండు మెటబాలిజం, ఎముక సాంధ్రత పెరుగుదలకు సహాయపడతాయి. ఎముక వ్యాధులు రాకుండా కూడా ఇది సహాయపడుతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News