Income Tax Saving Tips: ఇలా చేస్తే ఏకంగా 1 లక్షా 80 వేలు ట్యాక్స్ సేవ్ చేయవచ్చు

Income Tax Saving Tips: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ దాఖలు చేసే సమయం ఇది. సరైన పద్ధతులు, కొన్ని టిప్స్ పాటిస్తే పెద్దఎత్తున ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు. హెచ్ఆర్ఏ కింద ఈ ప్రయోజనం పొందవచ్చు. ఏకంగా 1 లక్షా 80 వేల రూపాయలు లబ్ది కలుగుతుంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 2, 2024, 02:40 PM IST
Income Tax Saving Tips: ఇలా చేస్తే ఏకంగా 1 లక్షా 80 వేలు ట్యాక్స్ సేవ్ చేయవచ్చు

Income Tax Saving Tips: ఇన్‌కంటాక్స్ సేవ్ చేయాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ అందరికీ అన్ని పద్థతులు తెలియకపోవచ్చు. కొన్ని టిప్స్ తెలుసుకుంటే హెచ్ఆర్ఏ కింద ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు. వాస్తవానికి ట్యాక్స్ సేవింగ్ చేసే పద్ధతులు చాలానే ఉంటాయి. అవి తెలుసుకోగలిగితే జీతం 12 లక్షల వరకూ ఉన్నా సరే ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరముండదు.

హెచ్ఆర్ఏ కింద ట్యాక్స్ మినహాయింపు పొందేందుకు ముందుగా కావల్సింది మీ భార్యతో రెంట్ అగ్రిమెంట్ కుదుర్చుకోవడం. ఈ ఒప్పందంలో అద్దె ఎంత, ఇతర కండీషన్లు క్షుణ్ణంగా ఉండాలి. మీరు చెల్లించే అద్దె బ్యాంకు ద్వారా లేదా చెక్ ద్వారా అంటే ఆన్‌లైన్‌లో మాత్రమే చెల్లించాలి. ఇది మీరు చెల్లించే అద్దెకు ప్రూఫ్‌లా ఉంటుంది. దీనిని మీరు మీ యజమాని నుంచి హెచ్ఆర్ఏ రూపంలో తీసుకోవచ్చు. హెచ్ఆర్ఏ లెక్కించేటప్పుడు కొన్ని కీలకమైన అంశాలు పరిగణలో తీసుకుంటారు. 

మీరు ఎంత మొత్తం హెచ్ఆర్ఏ తీసుకుంటారో అది పరిగణలో తీసుకుంటారు. మెట్రో సిటీలో అయితే 50 శాతం, నాన్ మెట్రో సిటీ అయితే 40 శాతం ఉంటుంది. బేసిక్ శాలరీ నుంచి 10 శాతం డిడక్ట్ అయ్యే మొత్తం పరిగణించాలి. 

మీ నెల జీతం ఒకవేల 1 లక్ష రూపాయలుంటే అందులో 20 వేలు హెచ్ఆర్ఏగా ఉంటుంది. మీరు మీ భార్యకు అద్దె రూపంలో 25 వేలు చెల్లించాలి. ఏడాదికి హెచ్ఆర్ఏ 2 లక్షల 40 వేలు అయితే, మీరు చెల్లించే అద్దె 3 లక్షలుంటుంది. బేసిక్ జీతంలో 10 శాతం అంటే 1 లక్షా 20 వేలుంటుంది. ఈ లెక్కన మీరు చెల్లించే 3 లక్షల అద్దెలోంచి 1 లక్షా 20 వేలు మినహాయిస్తే 1 లక్షా 80 వేలుంటుంది. మెట్రో నగరాల్లో 6 లక్షలకు 50 శాతం అంటే ఏడాదికి 6 లక్షల రూపాయలుంటుంది. ఈ మూడింట్లో కనీస మొత్తం 1 లక్షా 80వేల రూపాయలు ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు.

అయితే మీ రెంట్ అగ్రిమెంట్ పక్కాగా ఉండాలి. ఎలాంటి మోసం ఉండకూడదు. అద్దె చెల్లింపు ప్రూఫ్ అనేది బ్యాంక్ స్టేట్‌మెంట్ లేదా చెక్ రూపంలో చూపించాలి. మీ భార్య కూడా తన ఐటీ రిటర్న్స్‌లో అద్దెను ఆదాయంగా చూపించాలి. ట్యాక్స్ పెద్దఎత్తున సేవ్ చేయాలంటే మీ భార్యకు అద్దె చెల్లించినట్టు చూపించడం మంచి పద్ధతి. అయితే ఇదంతా పక్కాగా ఉండాలి. ఇది చేసే ముందు ఆడిటర్‌ను సంప్రదించడం మంచిది.

Also read: Gmail Shortcuts: జీ మెయిల్‌లో ఈ షార్ట్‌కట్స్ తెలుసుకుంటే చాలు, మీ పని క్షణాల్లో పూర్తవుతుంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News