/telugu/photo-gallery/2024-karthika-pournami-wishes-for-your-family-and-friends-with-hd-photos-beautiful-messages-sd-180865 2024 Karthika Pournami Wishes: మీ  కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఇలా తెలపండి..! 2024 Karthika Pournami Wishes: మీ కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఇలా తెలపండి..! 180865

AP Pensions: ఏపీలో తెలుగుదేశం-జనసేన-బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చాక తొలిసారిగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం అత్యంత ఆర్భాటంగా జరుగుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెరిగిన పింఛన్లను పంపిణీ చేస్తున్నారు. ఎవరెవరికి ఎంతెంత పింఛన్ వస్తోంది, అర్హులై ఉండి పింఛన్ దక్కనివారు ఎలా దరఖాస్తు చేసుకోవాలనే విషయాలు మీ కోసం అందిస్తున్నాం.

వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 3 వేలుగా ఉన్న పింఛనును కొత్త ప్రభుత్వం 4 వేలు చేసింది. ఇవాళ జూలై 1వ తేదీ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పంపిణీ జరుగుతోంది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, చేతి వృత్తిదారులకు ఇంటి వద్దే పింఛన్ల పంపిణీ జరుగుతోంది. ఇంకా చాలామందికి అర్హత ఉన్నా పింఛన్ లభించడం లేదు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా పించన్ కోసం అప్లై చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సామాజిక పెన్షన్లకు వృద్ధులు, వితంతువులు, నేత కార్మికులు, తోలు కార్మికులు, చెప్పులు కుట్టేవారు, ఒంటరి మహిళలు, హిజ్రాలు, హెచ్ఐవీ బాధితులు, డ్రమ్మర్లు, మత్స్యకారులు, చేతి వృత్తులవారు అర్హులు. వీరిలో సాధారణ లబ్దిదారులకు నెలకు 4 వేల రూపాయలు కాగా, వికలాంగులకు నెలకు 6 వేల రూపాయలు పెన్షన్ ఇవ్వనున్నారు. ఇక పూర్తిగా వికలాంగులైనవారికి నెలకు 15 వేలు అందిస్తారు. కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు నెలకు 10 వేల రూపాయలు పింఛన్ అందుతుంది. 

పింఛన్ కోసం ఇలా అప్లై చేయండి

ఏపీ ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లకు అర్హులై ఉండి పింఛన్ రాకుండా ఉంటే ఇప్పుడు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా ప్రభుత్వ అధికారిక పోర్టల్ https://sspensions.ap.gov.in/SSP/Home/Index ఓపెన్ చేయాలి. ఇప్పుడీ పోర్టల్‌లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ యోదన అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ ఫామ్‌లో మీ పేరు, మొబైల్ నెంబర్, ఆధార్ కార్డు నెంబర్ ఇతర కుటుంబ వివరాలు నమోదు చేయాలి. అడ్రస్ ప్రూఫ్, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజు ఫోటో వంటి పత్రాలు జత చేసి దరఖాస్తును గ్రామ పంచాయితీ కార్యాలయంలో సమర్పించాలి.

ఆన్‌లైన్ విధానంలో అప్లై చేయాలంటే ఇదే పోర్టల్ ఓపెన్ చేసి లాగిన్ చేయాలి. దీనికోసం మీ పేరు పాస్‌వర్డ్ వివరాలు నమోదు చేయాలి. మీ రిజిస్టర్ ఫోన్ నెంబర్‌కు వచ్చే ఓటీపీతో ధృవీకరించుకోవాలి. ఆ తరువాత ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. 

Also read: IMD Heavy Rains Alert: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Andhra pradesh ntr bharosa pension scheme know how to apply for new pension here is the step by step process to get pension rh
News Source: 
Home Title: 

AP Pensions: ఏపీలో పింఛన్ల పంపిణీ, మీరు అర్హులైతే ఇలా అప్లై చేసుకోండి

AP Pensions: ఏపీలో పింఛన్ల పంపిణీ, మీరు అర్హులైతే ఇలా అప్లై చేసుకోండి
Caption: 
AP Pensions ( file photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
AP Pensions: ఏపీలో పింఛన్ల పంపిణీ, మీరు అర్హులైతే ఇలా అప్లై చేసుకోండి
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Monday, July 1, 2024 - 13:38
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
44
Is Breaking News: 
No
Word Count: 
294