Best Superfoods: గుండె, మానసిక ఆరోగ్యం కల్గించే 5 సూపర్ ఫుడ్స్ ఇవే మలబద్ధకం ఇట్టే మాయం

ఆధునిక జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంటుంది. ముఖ్యంగా గుండె ఆరోగ్యం క్షీణిస్తుంటుంది. ఈ క్రమంలో 5 రకాల సూపర్ ఫుడ్స్ మీ గుండె ఆరోగ్యాన్ని పదికాలాలు పదిలంగా ఉంచుతాయి. ఈ ఐదు సూపర్ ఫుడ్స్ ఏంటో చూద్దాం.

Best Superfoods: ఆధునిక జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంటుంది. ముఖ్యంగా గుండె ఆరోగ్యం క్షీణిస్తుంటుంది. ఈ క్రమంలో 5 రకాల సూపర్ ఫుడ్స్ మీ గుండె ఆరోగ్యాన్ని పదికాలాలు పదిలంగా ఉంచుతాయి. ఈ ఐదు సూపర్ ఫుడ్స్ ఏంటో చూద్దాం.
 

1 /5

గుడ్లు మీ రెగ్యులర్ డైట్‌లో గుడ్లు ఉంటే ఇందులో ఉండే ప్రోటీన్లు శరీరానికి ఇన్‌స్టంట్ ఎనర్జీ అందిస్తాయి. అంతేకాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

2 /5

చియా సీడ్స్ చియా సీడ్స్ కూడా సూపర్ ఫుడ్స్‌లో ఒకటి. ఇందులో మెగ్నీషియం, మాంగనీస్, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. చియా సీడ్స్ తీసుకోవడం వల్ల మలబద్ధకం వంటి కడుపు సంబంధిత సమస్యలు దూరమౌతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

3 /5

బాదం బాదంలో విటమిన్ ఎతో పాటు కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. దాంతో చాలా రకాల వ్యాధులు దూరమౌతాయి. రోజూ బాదం తినడం వల్ల మస్తిష్కానికి కూడా మంచిది.

4 /5

వాల్‌నట్స్ వాల్‌నట్స్ తినడం వల్ల హార్మోన్ లెవెల్స్ సరిగ్గా ఉంటాయి. దాంతోపాటు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. వాల్‌నట్స్ మెదడు పనితీరును వేగవంతం చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 

5 /5

బ్రోకలీ బ్రోకలీని కొంతమంది పచ్చిగా సలాడ్ రూపంలో , మరికొంత మంది వండుకుని తింటారు. బ్రోకలీ తినడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్, ప్రోటీన్లు, విటమిన్ సి ఆరోగ్యానికి లాభదాయకం.