Modi and Shah political Strategy on Jammu and kashmir: దేశ ప్రధానిగా ముచ్చటగా మూడోసారి మోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత జమ్ముకశ్మీర్ లో పర్యటించనున్నారు. ఇటీవల దేశంలో ఉగ్రదాడుల ఘటనలు కలకలంగా మారాయి. ఇటీవల రియాసీలో ఉగ్రమూకలు వైష్ణోదేవీ ఆలయానికి వెళ్తున్న క్రమంలో దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో.. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు మోదీ ప్రమాణస్వీకారం చేసే వరకు కూడ దేశంలో.. అనేక మార్లు ఉగ్రదాడులు జరిగాయి. వరుస ఉగ్రదాడుల నేపథ్యంలో.. కేంద్రం కూడా సీరియస్ అయ్యింది. దీనిపై ఇటీవల అమిత్ షా కూడా హైలేవల్ సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఉగ్రవాదులను ఉక్కుపాదంతో అణచివేయాలని కూడా, హోమ్ మంత్రిత్వశాఖ స్పష్టమైన ఆదేశాలను జారీచేసింది.
Read more; Viral video: బాప్ రే.. సింహం నాలుకకు యాపిల్ వాచ్.. వైరల్ గా మారిన వీడియో ఇదే..
ఇదిలా ఉండగా.. మరోవైపు ప్రధాని మోదీ జూన్ 20, 21 తేదీల్లో జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో పర్యటించనున్న నేపథ్యంలో భద్రత దళాలు అప్రమత్తమయ్యారు. మరోవైపు శ్రీనగర్ లో మోదీ..ఈ పర్యటనలో మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలలో బిజీగా ఉంటారని తెలుస్తోంది. మరోవైపు జూన్ 21న ఉదయం 6:30 గంటలకు శ్రీనగర్‌లోని SKICCలో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని, సభను ఉద్దేశించి మాట్లాడతారు. దాదాపు 7 వేల మందితో కలిసి ప్రధాని మోదీ యోగా చేయనున్నారు. మోదీ పర్యటన సందర్భంగా.. జమ్ములో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా భద్రత చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
మోదీ, షాల ద్వయం..
త్వరలో జమ్ము కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ గెలుపే లక్ష్యంగా మోదీ, షాల ద్వయం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. మోదీ మూడు సారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించే అసాంతం పలుచోట్ల అనేక ఉగ్రదాడులు జరిగాయి. వీటిని భద్రత దళాలు కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఇటీవల జమ్ములో జరిగిన ఎన్నికలలో ప్రజలు ఎంతో ఉల్లాసంగా పాల్గొన్నారు.
Read more: Tears of camels: ఒంటె కన్నీరు పాముకాటుకు విరుగుడుగా పనిచేస్తుందంట... అసలు స్టోరీ ఏంటంటే..?
మరోవైపు ఈ ఏడాది.. సెప్టెంబర్ లోపు జమ్ము లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది. దీనిలో భాగంగా.. తొందరలోనే కేంద్ర ఎన్నికల సంఘం నగరా మోగించనుందని తెలుస్తోంది. ఈ క్రమంలో . జమ్ముకి ఈసారి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ప్రత్యేకంగా ఇన్ చార్జీగా నియమించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ప్రజల నుంచి పాటిటివ్ గా స్పందన వస్తుండటంతో, అధికార పీఠాన్ని కైవసం చేసుకునేందుకు మోదీ, షా ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter