/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ రోజు మంత్రివర్గం సమావేశం జరిగింది. ఈ  భేటీలో పలు విషయాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  హైకోర్టులో పనిచేసే ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు, డ్రైవర్ సాధికారిక సంస్థకు రూ. 10 కోట్ల మూలనిధి సహా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విశాఖ జిల్లా సింహాచలం భూములు సహా పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. 

బీసీలకు వరాల జల్లు..
 ఈ రోజు జరిగిన కేబినెట్ భేటీలో కొత్తగా బీసీ మూడు కార్పొరేషన్లు ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నారు 1) ముత్తరాసి, తెనుగోళ్లు, ముదిరాజ్ లకు బీసీ కార్పొరేషన్
 2 ) నాగరాలు, నాగవంశీకులకు మరో బీసీ కార్పొరేషన్ ఏర్పాటు 3 )నీరగీత, కల్లుగీతలకు ఇంకొక బీసీ కార్పొరేషన్ ..కాగా బీసీ కార్పొరేషన్ కు అపెక్స్ బాడీ ఏర్పాటు చేయాలని కేబినెట్ తీర్మానించింది. అలాగే కార్పొరేషన్ల పరిధిలోకి రాని మిగతా 54 కులాలకు న్యాయం చేయాలని నిర్ణయం తీసుకున్నారు

జర్నలిస్టులకు ఇళ్ల నిర్మాణం
ఇళ్లు నిర్మించుకునే స్థితిలో జర్నలిస్టులు లేనందున... భూమి తీసుకుని వారికి ఇళ్లు కట్టించి ఇవ్వాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రాయితీలతో కలిపి, అవసరమైతే జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్ ను వాడుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.  జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రత్యేక కేటగిరీగా నిర్ణయించింది. 

కేబినెట్  నిర్ణయాలు ఇవే..
* హైకోర్టు ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయింపు
*  కొత్తగా మూడు బీసీ కార్పొరేషన్లు 
*  బీసీ కార్పొరేషన్ కు అపెక్స్ బాడీ ఏర్పాటు
*  డ్రైవర్ సాధికార సంస్థకు రూ. 10 కోట్ల మూలనిధి
*  ఎక్సైజ్ కానిస్టేబుళ్ల పదోన్నతులు

* ఇళ్లు నిర్మించుకునే పరిస్థితుల్లో లేని జర్నలిస్టులకు భూమిని తీసుకొని ఇళ్లు కట్టించి ఇవ్వాలని నిర్ణయం
* ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం చినపవని దగ్గర గవర్నమెంట్ వెటర్నరీ కాలేజీ ఏర్పాటుకు ఆమోదం 
* విశాఖ జిల్లాలోని ఏపీఆర్ హైస్కూల్ ను రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీగా అప్ గ్రేడేషన్
*  విజయనగరం జిల్లా గరివిడి వెంటర్నరీ సైన్స్ కాలేజీలో 61పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం

Section: 
English Title: 
AP Cabinet key decision ; Happy news for BC communities
News Source: 
Home Title: 

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే...

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే...
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే...
Publish Later: 
No
Publish At: 
Monday, February 25, 2019 - 16:22