Top 5 Protein rich foods: ప్రొటీన్ మన శరీరానికి ఎంతో అవసరమైన ఖనిజం. ఇందులో అమైనో యాసిడ్స్ కూడా ఉంటాయి. అందుకే ప్రొటీన్ పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవాలని అంటారు. కండరాల అభివృద్ధికి కూడా తోడ్పడతాయి. అయితే, చికెన్, మాంసం, చేపలు, గుడ్లలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. కానీ, వెజిటేరియన్స్‌కు ప్రొటీన్ పుష్కలంగా ఉండే ఆహారాలు తక్కువ. ఓ 5 ఆహారాల్లో ప్రోటన్లు పుష్కలంగా ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం.
తోఫు..
తోఫులో ప్రొటీన్ ఉంటుంది. ఇది మొక్కల ఆధారిత ఆహారం. తోఫులో క్యాల్షియం, రాగి, ఫైబర్, ప్రొటీన్, కార్బొహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది గుండె, ఎముక ఆరోగ్యానికి ప్రేరేపిస్తుంది. అంతేకాదు కొలెస్ట్రాల్ నిర్వహిస్తుంది. అరకప్పు తోఫులో 21.8 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. ఇది రోజంతా మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్ అందిస్తుంది.
బీన్స్..
బీన్స్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. బీన్స్ తీసుకోవడం వల్ల కడుపు ఎక్కువ సమయంపాటు నిండిన అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే ఇందులో ఫబర్ పుష్కలంగా ఉంటుంది. ఒక సింగిల్ సర్వింగ్ బీన్స్‌లో 15 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. ఇది రైస్, గోధుమల్లో ఉండే ప్రోటీన్ల కంటే ఎక్కువ.
పప్పుధాన్యాలు..
ఇందులో విటమిన్స్, మినరల్స్, ఫైబర్, పొటాషియం, జింక్, ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. పప్పు ధాన్యాల్లో ఫైబర్ కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది జీర్ణ ఆరోగ్యానికి మంచిది. ఇది ప్రాణాంతక వ్యాధులను దూరం చేస్తుంది. పప్పు ధాన్యాలు రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహిస్తుంది.
ఇదీ చదవండి: బిల్వపత్రం పరగడుపున తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో చూడండి..
సోయా బీన్స్..
ప్రోటీన్ అధికంగా ఉండే మరో వెజిటేరియన్ ఆహారం సోయా బీన్స్. ఇది మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్ అందిస్తుంది. అంతేకాదు సోయా బీన్స్ గుండె ఆరోగ్యానికి మంచిది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను బయటకు పంపించేస్తుంది.
క్వినోవా..
ఒక కప్పు క్వినోవాలో 5 గ్రాముల ఫైబర్, 8 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. క్వినోవాలో అమైనో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. క్వినోవా కూడా వెజిటేరియన్స్‌కు మంచిది.
ఇదీ చదవండి: ఒక్క టమాటా చాలు రక్తపోటుకు చెక్ పెట్టడానికి.. ఈ 5 విషయాలు తెలుసుకోండి..
చియా సీడ్స్..
చియా సీడ్స్‌లో మొక్కల ఆధారిన ప్రొటీన్ ఉంటుంది. ఇందులో విటమిన్స్, ఖనిజాలు, పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు చియా సీడ్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కొన్ని ప్రాణాంతక వ్యాధును సైతం దూరం చేస్తుంది. చియా సీడ్స్‌లో ప్లాంట్ ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Top 5 Protein foods: ప్రొటీన్లు పుష్కలంగా ఉండే ఈ 5 ఆహారాలు.. వెజిటేరియన్లకు ఎంతో మేలు..