Naralokesh: పప్పు కాదూ నిప్పు.. 39 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన నారా లోకేష్..

Ap assembly election results 2024: ఏపీలో ప్రజలు నారా లోకేష్ కు సంచలన విజయం ను కట్టబెట్టారు.  మంగళగిరిలో 39 ఏళ్ల తర్వాత టీడీపీ ఇక్కడ సంచలన విజయంను నమోదు చేసినట్లైంది. ఈ రికార్డు వైఎసీపీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చినట్లు చెప్పుకొవచ్చు.

Written by - Inamdar Paresh | Last Updated : Jun 5, 2024, 01:27 PM IST
  • వైసీపీ నేతలకు బిగ్ షాక్ ..
  • వినూత్నంగా తీర్పునిచ్చిన మంగళగిరి ఓటర్లు..
Naralokesh: పప్పు కాదూ నిప్పు.. 39 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన నారా లోకేష్..

Ap assembly election results 2024: ఆంధ్ర ప్రదేశ్‌ ప్రజలు ఈసారి వినూత్నంగా ఎన్నికల ఫలితాలు ఇచ్చారు. ఏపీలో కొన్నిస్థానాలను  హాట్ సీట్లుగా ట్రెండింగ్ లో నిలిచాయి. మెయిన్ గా.. అమరావతిలోని మంగళగిరి, పవన్ కళ్యాణ్ బరిలో నిలిచిన పిఠాపురం, కడప వంటి కొన్ని స్థానాలు ఏపీలో ఫుల్ ట్రెండింగ్ లో నిలిచాయి. ఈక్రమంలో ఇప్పటికే వైఎస్సార్సీపీ పలుమార్లు లోకేష్ ను తమ విమర్శలతో టార్గెట్ చేశాయి. సోషల్ మీడియా వేదికల మీద, మీడియా సమావేశాలలో వైసీపీ నేతలు టీడీపీ నేత లోకేష్ ను పప్పు అంటూ తీవ్రమైన విమర్శలు చేశారు. అంతేకాకుండా.. ఆయనకు తెలుగుభాష రాదంటూ కూడా ట్రోలింగ్ లకు పాల్పడ్డారు.

Read more: Prewedding shoot: ప్రీవెడ్డింగ్ షూట్ లో తాత హల్ చల్.. కొత్త జంటకు ట్విస్ట్ మాములుగా లేదుగా.. వీడియో వైరల్..

పప్పు  అంటూ వ్యాఖ్యలు..

వైసీపీ నేతలు టీడీపీ నేత లోకేష్ ను అనేక సందర్భాలలో పప్పు.. పప్పు అంటూ తీవ్రమైన పదజాలాలతో వ్యక్తిగత విమర్శలు చేశారు. అంతేకాకుండా.. ఆయనకు తెలుగు రాదని, ట్యూషన్ పెట్టించుకొవాలంటూ ఎద్దేవా చేశారు. అనేక సందర్భాలలో లోకేష్ పబ్లిక్ మీటింగ్ లలో మాట్లాడుతూ.. పొరపాటున ఏదైన నోరుజారితే.. వాటిని వెపన్ గావాడుకునే వారు . ఒక రేంజ్ లో లోకేష్ ను తీవ్రమైన పదజాలాలతో వ్యక్తిగత హననంచేసే విధంగా వ్యాఖ్యలు చేశారు. కానీ నారా లోకేష్‌ వీటి పట్టించుకోకుండా తన దైన స్టైల్ లో ప్రచారం నిర్వహించారు. అంతేకాకుండా ప్రజలకు, టీడీపీ అధికారంలోకి వస్తే ఏంచేస్తామో వివరించి చెప్పడంలో సక్సెస్ అయ్యారు.

యువగళం యాత్రలు..

టీడీపీ నేత నారాలోకేష్‌ చేపట్టిన యువగళం యాత్రలు ఎంతో సక్సెస్ అయ్యిందని చెప్పుకొవచ్చు. ఈ సమావేశాలు, సభల్లో వల్ల టీడీపీ క్యాడర్ లో లోకేష్ ఒక కాన్ఫిడెన్స్ వచ్చేలా చేశారని చెప్పుకొవచ్చు. వైసీపీ వేధింపులతో ఇబ్బందులు పడుతున్న టీడీపీ కార్యకర్తలకు నేనున్నానంటూ కూడా భరోసా ఇచ్చారు. ప్రజల్లో టీడీపీ మరోసారి అధికారంలోకి చేసేమంచిని అన్ని వర్గాల ప్రజలకు తీసుకొని పోయేలా చేయడంలో నారా లోకేష్ సక్సెస్ అయ్యారని చెప్పుకొవచ్చు.

39 ఏళ్ల తర్వాత మంగళగిరిలో టీడీపీ పాగా..

దాదాపు మంగళగిరిలో 39 ఏళ్ల తర్వాత పసుపు జెండా ఎగిరిందని చెప్పుకొవచ్చు. మంగళగిరిలో టీడీపీ నుంచి నారా లోకేష్ ఎన్నికల బరిలో నిలబడ్డారు. ఇక్కడ వైఎస్సార్పీపీ నుంచి కాండ్రు లావణ్య ఎన్నికల బరిలో ఉన్నారు. అయితే.. మొదటి నుంచి టీడీపీ ఈ స్థానాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలో.. మొదటి నుంచి నారా లోకేష్ ఈసారి ఎన్నికలలో ఎలాగైన సత్తా చాటాలని, ప్రతిష్టాత్మంగా తీసుకుని ప్రచారం నిర్వహించారు. ఇక్కడ 1985 లో తొలిసారి నారా లోకేష్‌ ఎన్నికలో విజయం  సాధించింది.

ఆ తర్వాత ఇప్పుడు మరల నారా లోకేష్ విజయ ఢంకా మోగించారు. వైసీపీకి ప్రజలు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. అమరావతిలో నిరంతరం ప్రజలకు నారా లోకేష్ అందుబాటులో ఉంటూ, తానున్నంటూ కూడా ప్రజలకు భరోసా ఇస్తు ప్రచారం నిర్వహించారు. ఇక ఎన్నికలలో నారా బ్రాహ్మణి సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం కూడా లోకేష్ కు ప్లేస్ అయిందని చెప్పుకొవచ్చు. 

Read more: Snakes Video: బాప్ రే.. కింగ్ కోబ్రాకు షాంపుతో స్నానం... వీడియో వైరల్..

ఎక్కడైతే.. ట్రోలింగ్ కు గురయ్యాడో.. కనీసం మంగళగిరి అని పలకడం రాదని ఆయనను ట్రోల్ చేశాడో.. అక్కడే నారాలోకేష్ సెన్సెషన క్రియేట్ చేశారు. అంతే కాకుండా... ప్రజల మనస్సులు గెలవడంలో గొప్ప విజయం సాధించారని చెప్పుకొవచ్చు. 1985లో టీడీపీ అభ్యర్థి గెలిచారు. ఆ ఎన్నికల తర్వాత మళ్లీ తెలుగు దేశం అక్కడ విజయం సాధించడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు ఆ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ 17 వేల 265 గా ఉంది. ఆ రికార్డును లోకేశ్‌ తిరగరాస్తూ.. వైసీపీ అభ్యర్థి ఎం. లావణ్యపై.. 91 వేలకుపైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో  లోకేష్ సాధించినదే రాష్ట్రం మొత్తంమ్మీద అత్యధిక మెజారిటీలలో టాప్ ౩ లో ఒకటిగా నిలిచింది. 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News