Clove oil benefits: ఇలా చేస్తే 3 రోజుల్లో మీ జుట్టు ఒత్తుగా.. పొడుగ్గా పెరుగుతుంది..

Clove oil hair benefits: లవంగాన్ని వంటల్లో వాడతాం. అయితే సాధారణంగా లవంగం నూనెను తిని పంటి నొప్పికి కూడా ఉపయోగిస్తారు. అయితే ఈ నూనెను జుట్టుకు ఉపయోగించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి .

Written by - Renuka Godugu | Last Updated : Jun 2, 2024, 07:12 AM IST
Clove oil benefits: ఇలా చేస్తే 3 రోజుల్లో మీ జుట్టు ఒత్తుగా.. పొడుగ్గా పెరుగుతుంది..

Clove oil hair benefits: లవంగాన్ని వంటల్లో వాడతాం. అయితే సాధారణంగా లవంగం నూనెను తిని పంటి నొప్పికి కూడా ఉపయోగిస్తారు. అయితే ఈ నూనెను జుట్టుకు ఉపయోగించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. సాధారణంగా లవంగాన్ని ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో ఏళ్లుగా మెడిసిన్స్‌ తయారీలో ఉపయోగిస్తారు.ఎందుకంటే లవంగంలో నయం చేసే గుణాలు ఉంటాయి. మీ హెయిర్ కేర్ రొటీన్ లో లవంగం ఉపయోగించడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. లవంగం నూనెతో కొబ్బరి నూనె, జోజోబ ఆయిల్ వంటివి కలిపి అప్లై చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా..పొడుగ్గా పెరుగుతుంది. జుట్టుకు పునరుజ్జీవనం అందిస్తుంది. దీనివల్ల వల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం. 

పొడవైన జుట్టు ..
లవంగం నూనే జుట్టుకు అప్లై చేయడం వల్ల కేవలం మూడు రోజుల్లోనే మీ జుట్టు ఒత్తుగా.. పొడవుగా పెరగడం చూస్తారు ఎందుకంటే లవంగం నూనెలో యుగెనల్ ఉంటుంది. ఇది కుదుళ్లలో రక్తప్రసరణను మెరుగుపరిచి,  ఆరోగ్యం గా చేస్తుంది రక్తప్రసరణ మెరుగవుతే హెయిర్ ఫాలికల్స్ ఆరోగ్యంగా ఉంటాయి.  దీంతో జుట్టూ పెరుగుతూ ఉంటుంది. ఇక హెయిర్ ఫాల్ సమస్య అనేది చూడరు.

 బలమైన జుట్టు..
లవంగంలో ఎన్నో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో విటమిన్ ఇ ఉంటుంది. అంతే కాదు లవంగం నూనెలో మ్యాంగనీస్, ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది కుదుళ్ల నుంచి జుట్టును బలంగా మారుస్తుంది, స్ల్పిట్‌ ఎండ్స్ సమస్య రాకుండా జుట్టును పొడుగ్గా పెరిగేలా ప్రేరేపిస్తుంది.

ఇదీ చదవండి: ఈ 5 మార్నింగ్ డ్రింక్స్‌ తీసుకుంటే శరీరాన్ని డిటాక్సిఫై చేయడమేకాదు, బరువు కూడా తగ్గించేస్తుంది..

డ్యాండ్రప్‌ కంట్రోల్..
డ్యాండ్రప్‌ వల్ల హెయిర్‌ ఫాల్‌ సమస్య విపరీతంగా పెరుగుతుంది. దీనికి లవంగం నూనె ఎఫెక్టివ్ రెమిడీ. ఎందుకంటే లవంగం నూనెలో యాంటీఫంగల్‌, యాంటీ మైక్రోబియన్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టును ఇన్ఫెక్షన్ బారిన పడకుండా రక్షిస్తుంది. జుట్టు కుదుళ్లలో దురద సమస్యలు ఉన్నవారికి లవంగం నూనె ప్రభావవంతంగా పనిచేస్తుంది. జుట్టు కుదుళ్ళలో పేరుకున్న డ్యాండ్రఫ్ ను సమర్థవంతంగా తొలగిస్తుంది. హెయిర్ ఫాల్ సమస్యలను నివారిస్తుంది జుట్టు ఆరోగ్యంగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది.

నేచురల్ హెయిర్ కలర్..
లవంగం నూనె కుదుళ్లకు వెచ్చదనాన్నే అందిస్తుంది. మీకు నల్లని ఒత్తైనా జుట్టు కావాలంటే లవంగం లో నేను మీ హెయిర్ కి అప్లై చేయండి. దీంతో మీ జుట్టుకు నేచురల్ కలర్ అందిస్తుంది కూడా.

 ఇదీ చదవండి: ఈ బీట్‌రూట్‌ లిప్‌ బామ్‌ ఇంట్లోనే తయారు చేసుకోండి.. మీ పెదాలు సహజసిద్ధంగా పింక్ రంగులోకి మారిపోతాయి..
 కుదుళ్ల ఆరోగ్యం..
లవంగం నూనెను కుదుళ్ళకు అప్లై చేయడం వల్ల జుట్టుపై అదనపు నూనె ఉత్పత్తి సమతులమవుతుంది. ఇది కుదుళ్ల ఆరోగ్యానికి ప్రేరేపిస్తుంది. జుట్టు పొడిబారకుండా అతిగా నూనె ఉత్పత్తిని నివారిస్తుంది. లవంగంతో పొడవైన జుట్టు కేవలం మూడు రోజుల్లోనే పెరగడం మీరు చూస్తారు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News