Telangana Formation Day: పద్నాలుగేళ్ల పోరాటం చేసి.. అనంతరం పదేళ్ల పాటు తెలంగాణను పరిపాలించిన బీఆర్‌ఎస్ పార్టీ తొలిసారి ప్రతిపక్ష స్థానంలో ఉండి తెలంగాణ ఆవిర్భావ సంబరాలు నిర్వహించింది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రారంభించిన దశాబ్ది ఉత్సవాలను ముగింపు కార్యక్రమాలు నిర్వహించింది. ముగింపు ఉత్సవాల్లో తొలి రోజైన శనివారం అమరవీరులకు నివాళులర్పించింది. అమరులను స్మరిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టింది.
Also Read: Telangana Lok Sabha: తెలంగాణలో అనూహ్య ఫలితాలు.. కాంగ్రెస్‌కు బీజేపీ షాక్.. కారు షెడ్డుకే?
హైదరాబాద్‌లోని అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్‌లో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద శనివారం సాయంత్రం బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పుష్పాంజలి ఘటించారు. అనంతరం కొవ్వొత్తుల ప్రదర్శనను ప్రారంభించారు. పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలతో కలిసి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నాయకులు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. అమరవీరులకు జోహార్లు అంటూ నినాదాలు చేస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన కొనసాగింది. దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న అమరవీరుల స్మారక నిర్మాణం వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన ముగిసింది. అక్కడ అందరూ కొవ్వొత్తులు వెలిగించి అమరులకు నివాళులర్పించారు.
Also Read: Hyderabad Lok Sabha: మాధవీలతకు భారీ షాకిచ్చిన ఎగ్జిట్ పోల్స్.. అసద్ గెలవబోతున్నారా?
ఇప్పటికే ప్రకటించిన విధంగా జూన్ 2, 3వ తేదీల్లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించే దశాబ్ధి ఉత్సవాల ముగింపు వేడుకలు జరుగనున్నాయి. అవతరణ దినోత్సవం రోజు ఆదివారం తెలంగాణ భవన్‌లో జాతీయ జెండా కేసీఆర్ ఎగురవేయనున్నారు. ఇక సోమవారం రాష్ట్రవ్యాప్తంగా జాతీయ జెండాతోపాటు గులాబీ జెండా ఎగురవేయడంతోపాటు ఆస్పత్రులు, అనాథ, వృథాశ్రమాల్లో సేవా కార్యక్రమాలు చేయనున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter