Vitamin D rich dryfruits: సూర్యరక్ష్మిలో విటమిన్ డి సహజసిద్ధంగా ఉంటుంది. ఇది మన ఎముక అభివృద్ధికి కూడా ఎంతో ముఖ్యం. అయితే విటమిన్-డి కరిగే విటమిన్. ఇది హార్మోన్ల పనితీరును సహాయపడుతుంది. అంతేకాదు మన శరీరంలో విటమిన్ ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. ఉదయం సన్లైట్ లో వచ్చే విటమిన్ డి మన బొక్కలకు చేరుకొని బలవంతంగా చేస్తాయి. అయితే ఎండ వేడిమి అతిగా ఉన్న తరుణంలో బయటికి రాలేని పరిస్థితి ఉంది. ఈ సమయంలో కొన్ని రకాల గింజలు మీ డైట్ లో చేర్చుకుంటే సహజసిద్ధంగా విటమిన్ శరీరానికి అందినట్లు అవుతుంది. విటమిన్ డి పుష్కలంగా ఉండే డ్రై ఫ్రూట్స్ ఏంటో తెలుసుకుందాం.
సాధారణంగా గింజలు మన డైట్ లో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని మనకు తెలిసిందే. ముఖ్యంగా ఇందులో ఖనిజాలు మన శరీర అభివృద్ధికి అవసరం. డ్రైఫ్రూట్స్ సీడ్స్ గింజల్లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. వీటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
విటమిన్ డీ ఉండే గింజలు మెదడు పనితీరుని మెరుగుపరుస్తుంది. పళ్ళు, బొక్కలను బలంగా మారుస్తుంది. ఇమ్యూనిటీ వ్యవస్థను మెరుగు చేస్తుంది. బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది. యాంగ్జైటీ కూడా మీ దరిదాపులోకి రాదు అంతేకాదు వెయిట్ లాస్ లో కూడా తోడ్పడుతుంది కొలెస్ట్రాల్ లెవెల్ సులభంగా తగ్గిపోతాయి, బిపి లెవెల్స్ అదుపులో ఉంటాయి. కార్డియో వాస్కులర్ హెల్త్ కి మెరుగుపరుస్తుంది.
బాదం..
బాదం డ్రైఫ్రూట్ ఇందులో విటమిన్స్ ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్స్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది తీసుకోవడం వల్ల కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. భాగంలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. బరువు నిర్వహిస్తుంది ఎముకలు చర్మ ఆరోగ్యానికి ప్రోత్సహిస్తుంది. అంతేకాదు బాదం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడి మెటబాలిజం రేటు పెరుగుతుంది.
ఇదీ చదవండి:ఈ మండే ఎండలకు వేడి కాఫీ కాకుండా ఇలా కోల్డ్ కాఫీ తాగితే బోలెడు ప్రయోజనాలు..
జీడిపప్పు..
జీడిపప్పులో కూడా విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. దీన్ని మంచి స్నాక్ ఐటమ్ లో తీసుకోవచ్చు ఇందులో విటమిన్స్ మినరల్స్ ఉంటాయి. అంతేకాదు జీడిపప్పుల మ్యాంగనీస్, ఫాస్ఫరస్, జింక్ కూడా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఖర్జూరం..
ఖర్జూరంలో కూడా విటమిన్ డీ పుష్కలంగా ఉంటుంది. ఇది మంచి స్నాక్స్ లా తీసుకోవచ్చు ఖర్జూరం తీసుకోవడం వల్ల తక్షణ శక్తి అందుతుంది. ఖర్జూరంలో విటమిన్ b6 ఉంటుంది ఇది మూడు స్వింగ్స్ బారిన పడకుండా కాపాడుతుంది దీని నేరుగా తినవచ్చు ఏదైనా హెల్దీ స్నాక్ మాదిరి తయారు చేసుకొని తీసుకోవచ్చు
అప్రికట్స్..
ఇందులో కూడా పోషకాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ డి కూడా ఉంటుంది అంతేకాదు ఇందులో విటమిన్ ఏ కంటి ఆరోగ్యానికి మెరుగు పరుస్తుంది. ప్రతిరోజు గుప్పెడు అప్రికట్స్ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. సలాడ్ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఇది గుండె సమస్యలు రాకుండా నివారిస్తుంది.
ఇదీ చదవండి:ఎండకాలం ప్రతిరోజూ ఆరెంజ్ జ్యూస్ తాగితే మీ శరీరంలో ఏ మార్పు జరుగుతుందో తెలుసా?
ఫిగ్..
అంజీర్ పండు లేదా ఫిగ్స్ లో కూడా విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది ఇందులోని మినరల్స్ ఐరన్ క్యాల్షియం, పొటాషియం కూడా ఉంటుంది. ఫిగ్స్ తీసుకోవటం వల్ల తీపి తినాలని కోరిక తగ్గుతుంది వీటిని స్మూథీరూపంలో కూడా తీసుకోవచ్చు గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
ఎండు ద్రాక్ష..
ఎండు ద్రాక్షాన కిస్మిస్ అని కూడా పిలుస్తారు. ఇందులో కూడా విటమిన్ డీ ఉంటుంది. మన శరీరానికి విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ బి వీటితో అందుతుంది.
వాల్నట్స్..
వాల్నట్స్ అక్రోట్లు అని కూడా పిలుస్తారు. ఇది పోషకాల గని. ఇందులో విటమిన్ డి కూడా ఉంటుంది అంతేకాదు వాల్‌నట్స్ లో ఒరమెగా 3 ఫ్యాటీ ఆసిడ్స్, విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ పెరగకుండా కాపాడుతుంది వీటిని సలాడ్స్ రూపంలో తీసుకోవచ్చు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Vitamin D rich dryfruits: విటమిన్ D పుష్కలంగా ఉండే 7 గింజలు ఇవే.. మీ డైట్ లో ఉన్నాయా?