Ts formation day june 2nd celebrations 2024: తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు గ్రాండ్ గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో ఇప్పటిక సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణలో ఆవిర్భావ దినోత్సవ వేడుకల కోసం ఈసీ నుంచి అనుమతులు కూడా తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి జరిగే ఆవిర్భావ వేడుకలు కావడంతో, రేవంత్ సర్కారు ఈ ఉత్సవాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎం రేవంత్ తనదైన మార్కు చూపించాలని భావిస్తున్నారు. దీనిలో భాగంగా.. తెలంగాణను ఇచ్చిన తల్లిగా.. సోనియమ్మను ఈ ఉత్సవాలను రావాల్సిందిగా ఇప్పటికే ఢిల్లీకి వెళ్లి మరీ ఆహ్వానించారు. సోనియాతో పాటు కాంగ్రెస్ హైకమాండ్ సీనియర్లను కూడా ఆయన ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణలోని ఉద్యమ కారులు, ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరుల కుటుంబాలకు కూడా ప్రత్యేకంగా ఆహ్వానాలు అందజేశారు. కవులు, కళాకారులు, ప్రముఖులకు కూడా ఇప్పిటికే ఇన్విటేషన్ లు పంపించినట్లు తెలుస్తోంది.
Read more: Cop cpr on monkey: హ్యాట్సాఫ్ సార్.. సీపీఆర్ చేసి కోతిని కాపాడిన పోలీసు.. వీడియో వైరల్..
ఇదిలా ఉండగా... తెలంగాణ రాష్ట్రగేయం, లోగోలను తిరిగి కొత్తగా ఆవిష్కరణకు అన్నిరకాల ఏర్పాట్లు జరిగాయి. కానీ లోగో విషయంలో మరిన్ని సలహాలు, సూచనలు రావడంతో, లోగో ప్రకటన విషయంలో మాత్రం వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ సర్కారు ప్రకటించింది. కానీ తెలంగాణ రాష్ట్రగీతం జయ జయ హే తెలంగాణ.. గీత రచయిత అందెశ్రీ, దీనికి కీరవాణి ఇప్పటికే స్వరం అందించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర అవతరణ రోజైన జూన్ 2 న గీతాన్ని ఆవిష్కరించనున్నట్లు టీఎస్ సర్కారు ఇప్పటికే ప్రకటించింది. అదే విధంగా తెలంగాణ రాష్ట్రగీతం రాసిన అందెశ్రీ , స్వరం అందించిన కీరవాణీలను తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల రోజున ఘనంగా సన్మానించినున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఉత్సవాలకు రావాల్సిందిగా గులాబీబాస్ కు లేఖను పంపారు. ప్రభుత్వం తరపున ప్రత్యేకంగా ఆయన నివాసానికి వెళ్లి, లేఖను అందించాలని ఆయన సలహాదారు హర్కర్ వేణు గోపాల్ ను ఆదేశించారు. కేసీఆర్ నివాసానికి వెళ్లి, తాను ప్రత్యేకంగా చెప్పానని విషయం తెలియజేయాలని సూచించారు. ఇక మరోవైపు తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ హజరు కానున్న విషయం తెలిసిందే. మరికొన్ని రోజుల వ్యవధిలో ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఈ ఉత్సవాలు మరింత హీట్ ను పెంచేదిగా మారింది.
Read more: Hot Romance: రన్నింగ్ బస్సులో అశ్లీల పనులు.. లాస్ట్ సీటులో ఒకరిమీద మరోకరు..
ఎన్నికలలో అన్నిపార్టీలు తమదైన స్టైల్ లో ప్రచారం నిర్వహించాయి. ఎవరికి వారే.. గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజలు తమకు పట్టం కడతారని కాంగ్రెస్ అంటుంటే, తెలంగాణను పోట్లాడి సాధించుకున్న బీఆర్ఎస్ ను ప్రజలు దీవిస్తారని గులాబీ శ్రేణులు అంటున్నారు. ఇక బీజేపీ కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ లు రహస్య ఎజెండాను కుదుర్చుకున్నాయని విమర్శిస్తున్నారు. ఈసారి తెలంగాణలో ఎంపీ సీట్లను బీజేపీ భారీగా గెలుచుకుంటుందని బీజేపీ కూడా అంతే ధీమాగా ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter