iPhone 16 Features: ప్రస్తుతం ఐఫోన్ 15 సిరీస్ నడుస్తోంది. త్వరలో అంటే సెప్టెంబర్ నెలలో ఐఫోన్ 16 లాంచ్ కానుంది. ఐఫోన్ 16 కెమేరా విషయంలో గత మోడళ్లకంటే అద్బుతంగా ఉండనుందని సమాచారం. ఎందుకంటే చాలా ఫీచర్లు అప్‌గ్రేడ్ అయ్యాయి. మెయిన్ కెమేరా, సెల్ఫీ కెమేరా విషయంలో మార్పులు గమనించవచ్చు.
ఐఫోన్ 16 సిరీస్ 6.3, 6.9 ఇంచెస్ పరిమాణంలో క్యాప్చర్ బటన్‌తో వస్తున్నాయి. అత్యంత వేగవంతమైన ఏ సిరీస్ చిప్ ఉండటం ఓ ప్రత్యేకత. స్టాండర్స్ మోడల్స్‌లో వెర్టికల్ కెమేరాలుంటాయి. వైఫై 7 సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఐఫోన్ 16 ప్రో అయితే 6.3 ఇంచెస్‌లోనూ, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ అయితే 6.9 ఇంచెస్‌లోనూ ఉంటుంది. ఐఫోన్ 16లో వినియోగించే ఏ సిరీస్ చిప్స్ లేటెస్ట్ N3E 3 నానోమీటర్ నోడ్తో నిర్మితమయ్యాయి. దాంతో పనితీరులో మార్పు కన్పిస్తుంది. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్రోలో వేర్వేరు చిప్స్ ఉంటాయి. ఐఫోన్ 16లో క్యాప్చర్ బటన్ కొత్తగా కన్పిస్తుంది. డిజిటల్ కెమేరాకు ఉండే షటర్ బటన్‌లా పనిచేస్తుంది. ఇందులో టెట్రాప్రిజమ్ 5x ఆప్టికల్ జూమ్ లెన్స్ ఉండవచ్చని తెలుస్తోంది. ఐఫోన్ 16లో కెమేరా సెటప్ కోసం చాలా డిజైన్లు పరిశీలించినా చివరికి వెర్టికల్ ఎలైన్ సిస్టమ్ నిర్ణయించినట్టు సమాచారం.
పిల్ షేప్‌లో బంప్ వచ్చినట్టుగా ఉండే ఎలైన్‌మెంట్‌లో వైట్, అల్ట్రా వైడ్ లెన్స్ ఉంటాయి. లెన్స్ తరువాత మైక్రోఫోన్ ఉంటుంది. ఇందులో ప్రైమరీ కెమేరా Sony IMX 903 48 మెగాపిక్సెల్ రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మోడల్స్‌లో 12 మెగాపిక్సెల్స్ నుంచి 48 మెగాపిక్సెల్స్ వరకూ కెమేరా ఉంటుంది. ఐఫోన్ 15లో ఉన్నట్టే యూఎస్బి టైప్ సి పోర్ట్ ఉండవచ్చు. ఇక బ్యాటరీ అయితే గరిష్టంగా 4676 ఎంఏహెచ్ సామర్ధ్యంతో ఉంటుంది. ఐఫోన్ 16 బ్లాక్, గ్రీన్, పింక్, బ్లూ, వైట్ రంగుల్లో లభ్యం కావచ్చు.
Also read: Amazon Limited Offer: 50MP కెమేరా 8GB Ram iQoo ఫోన్‌పై అమెజాన్‌లో భారీ డిస్కౌంట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook