ప్రముఖ యాంకర్, నటి రష్మీతో స్వల్ప తప్పిదం జరిగింది. బోగి పర్వదినం రోజు మకర సంక్రాంతి విష్ చేస్తూ బోగిమంటల వీడియో పోస్టు చేశారు. దీంతో పలువురు నెటిజన్లు పోస్టుపై సెటైర్లు సంధించారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ ' మకర సంక్రాంతి కాదు మేడమ్.. అది భోగి అని, దయచేసి తెలుగు నేర్చుకోండి' అంటూ కామెంట్ చేశాడు. ఇలా అనేక మంది అనేక రకాలుగా సెటైర్లు సంధించారు.
నెటిజిన్ చేసిన కామెంట్స్ పై యాంకర్ రష్మీ తన బాధను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె బదులిస్తూ తమ కుటుంబంలో కేవలం మకర సంక్రాంతిని మాత్రమే జరుపుకుంటామని..అందుకే ఆవిధంగా విషెస్ తెలుపుతూ ట్వీట్ చేశానని వివరణ ఇచ్చారు.... మీ సంప్రదాయాలను నేను ఎలా అయితే గౌరవించానో.. అలానే మీరూ నన్నూ గౌరవించాలి తప్ప ఎలాంటి కారణం లేకుండా ఇలాంటి వ్యాఖ్యలతో బాధించకూడదని ఆ నెటిజన్ కు రష్మీ చురకలంటించడం గమనార్హం
వాస్తవానికి ఈ ఏడాది మకర సంక్రాంతి ఎప్పుడన్న విషయాన్ని రష్మీ ‘గూగుల్’లో వెతికారు. గూగుల్ ఆధారంగా సెర్చ్ రిజల్ట్ ఆధారంగా రష్మీ ట్వీట్ చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఇది కాస్తా స్పల్ప వివాదానికి కారణమైంది.
Happy MAKAR SANKRANTI pic.twitter.com/ADwyk0Bgc3
— rashmi gautam (@rashmigautam27) January 14, 2019
నటిగా కెరీస్ ను కొనసాగించిన రష్మీ ప్రస్తుతం ఓ ప్రముఖ ఛానల్ ప్రసారం చేస్తున్న కామిడీ షో 'జబర్దస్త్ ' లో యాంకర్ గా వ్యవమరిస్తున్నారు. కెరీర్ తొలినాళ్లలో తెలుగు చిత్రాల్లో ఆమె.. అవకాశాలు రావడంతో తమిళ చిత్రాల్లో కూడా నటించారు. ఇటి నటిగా గుర్తింపు తెచ్చుకున్న రష్మీ.. ప్రస్తుతం ప్రముఖ కామిడీ షో ఎక్ట్రా జబర్దస్ లో యాకంర్ గా వ్యవరిస్తున్నారు
సంక్రాంతి విష్ లో స్వల్ప తప్పిదం : నెటిజన్ల సెటైర్లతో బాధపడ్డ జబర్దస్త్ రష్మీ