/telugu/photo-gallery/2024-karthika-pournami-wishes-for-your-family-and-friends-with-hd-photos-beautiful-messages-sd-180865 2024 Karthika Pournami Wishes: మీ  కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఇలా తెలపండి..! 2024 Karthika Pournami Wishes: మీ కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఇలా తెలపండి..! 180865

Andhra Pradesh Election Counting: దేశం దృష్టిని ఆకర్షించిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల భవితవ్యం జూన్‌ 4వ తేదీన తేలనుంది. అసెంబ్లీ ఎన్నికలతోపాటు లోక్‌సభ ఎన్నికలు జరగ్గా ఆ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం పటిష్ట చర్యలు చేపట్టనుంది. ఈనెల 13వ తేదీన ప్రజలు ఇచ్చిన తీర్పుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే ఫలితాలపై ఎవరి ధీమాపై వారు ఉండగా.. ఎన్నికల సంఘం మాత్రం ఫలితాల వెల్లడిపై దృష్టి సారించింది. ఎన్నికల అనంతరం జరిగిన హింస మళ్లీ అలాంటి పరిస్థితులు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌ కుమార్ మీనా ప్రభుత్వ అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Also Read: Macherla: పోలింగ్‌ కేంద్రంలో ఎమ్మెల్యే పిన్నెల్లి బీభత్సం, దౌర్జన్యం.. ఎన్నికల సంఘం కఠిన చర్యలకు సిద్ధం

 

వచ్చే నెల 4వ తేదీన చేపట్టనున్న ఓట్ల లెక్కింపుపై గురువారం సచివాలయం నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ఆయన వీడియో కాన్పరెన్స్‌ నిర్వహించారు. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను సమీక్షించారు. ఫలితాల వెల్లడికి పటిష్ట ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను ఆదేశించారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ కచ్చితమైన ఫలితాలను త్వరితగతిన ప్రకటించేలా ముందస్తు ఏర్పాట్లు ప్రణాళికా బద్దంగా చేసుకోవాలని సూచించారు.

Also Read: AP Elections 2024: ఆంధ్ర ప్రదేశ్‌లో జనసేన ఖచ్చితంగా గెలిచే సీట్లు ఇవేనా.. ? పందెం రాయుళ్ల బెట్టింగ్ ఆ సీట్లపైనే.. ?

 

కొన్ని సంఘటనలు మినహా సమష్టి కృషితో ఈ నెల 13వ తేదీన ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినట్లు సీఈఓ ముకేశ్‌ కుమార్‌ తెలిపారు. ఇదే స్పూర్తితో ఓట్ల లెక్కింపును కూడా ప్రణాళికాబద్దంగా ఏర్పాట్లు చేసుకుని విజయవంతంగా నిర్వహిద్దామని పిలుపునిచ్చారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లను ముందే చేసుకోవాలని చెప్పారు. వివాదాలకు తావులేకుండా సంబంధిత  వివరాలను అంటే ఏ రోజున, ఎన్నిక గంటలకు, ఎన్ని టేబుళ్లపై ఓట్ల లెక్కింపు నిర్వహిస్తున్నది రాతపూర్వకంగా అభ్యర్థులు, ఎన్నికల  ఏజంట్లకు ముందుగానే తెలపాలని చెప్పారు. మీడియాకు ప్రత్యేకంగా కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

స్ట్రాంగ్‌ రూమ్‌ల నుంచి ఓట్ల లెక్కింపు కేంద్రాలకు పోలింగ్‌ యంత్రాలను తరలించే మార్గాలు, అభ్యర్థులు, ఏజంట్లు వెళ్లడానికి వేర్వేరు మార్గాలు ఏర్పాటు చేయాలని సీఈఓ సూచించారు. బారికేడ్లతో పాటు సూచికల బోర్డ్‌లను కూడా ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాలకు వేర్వేరుగా పోలింగ్ కేంద్రాల సంఖ్యను బట్టి ఓట్ల లెక్కింపు టేబుళ్లను ఏర్పాటు చేయాలన్నారు. సుశిక్షితులైన సిబ్బందిని నియమించుకోవాలని, వారికి శిక్షణ, హై స్పీడ్ ఇంటర్నెట్, కంప్యూటర్లు, ప్రింటర్స్ వంటి వాటిపై సూచనలు చేశారు. గుర్తింపు కార్డులు లేని వ్యక్తులు, అనధికార వ్యక్తులను, ఇతరుల వాహనాలను ఓట్ల లెక్కింపు జరిగే ప్రాంగణాల్లోకి అనుమతికుంచవద్దని స్పష్టం చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Section: 
English Title: 
Mukesh Kumar Meena High Level Reveiw On June 4 Andhra Pradesh Election Counting Rv
News Source: 
Home Title: 

Election Counting: ఆంధ్రప్రదేశ్‌ ఓట్ల లెక్కింపుపై ఈసీ దృష్టి.. మళ్లీ హింస చెలరేగకుండా పటిష్ట చర్యలు

Election Counting: ఆంధ్రప్రదేశ్‌ ఓట్ల లెక్కింపుపై ఈసీ దృష్టి.. మళ్లీ హింస చెలరేగకుండా పటిష్ట చర్యలు
Caption: 
Mukesh Kumar Meena Review Andhra Pradesh Election Counting (Source: File)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Election Counting: ఆంధ్రప్రదేశ్‌ ఓట్ల లెక్కింపుపై ఈసీ దృష్టి.. భారీగా బందోబస్తు
Ravi Kumar Sargam
Publish Later: 
No
Publish At: 
Thursday, May 23, 2024 - 13:47
Created By: 
Ravi Kumar Sargam
Updated By: 
Ravi Kumar Sargam
Published By: 
Ravi Kumar Sargam
Request Count: 
42
Is Breaking News: 
No
Word Count: 
314