Natural Remedies for Easy Digestion: ఏ పండగలు, శుభకార్యాలు జరిగినా హెవీ మిల్స్ తినాల్సి వస్తుంది. మసాలాలు ,కారం ఎక్కువగా ఉండే ఆహారాలు తినాల్సి వస్తుంది. అటువంటి సమయంలో కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి. కడుపులో అజీర్ణం, గ్యాస్ సమస్యలు వేధిస్తాయి.
Natural Remedies for Easy Digestion: ఈ ఎండాకాలం సీజన్లో కూడా ఏది తిన్నా సరిగా డైజెస్ట్ అవ్వదు. కడుపు సమస్యలు విపరీతంగా ఉంటాయి. రెస్టారెంట్లోకి వెళ్ళినప్పుడు హెవీ భోజనం తిన్నాక మౌత్ ఫ్రెషనర్స్ కూడా ఇస్తారు. అంటే సోంపు, యాలకులు వంటివి, క్యాండీస్ వంటివి ఇస్తారు ఇది మంచి డైజేషన్ కి సహాయపడతాయి. మీరు కూడా హెవీ మిల్స్ తిన్నాక ఈ ఒక్కటి నోట్లో వేసుకుంటే సులభంగా హాయిగా జీర్ణం అయిపోతుంది. ఎలాంటి కడుపు సంబంధిత సమస్యలు రావు అవేంటో తెలుసుకుందాం.
సోంపు.. హెవీ మీల్స్ తిన్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ సోంపు గింజలను నోట్లో వేసుకొని నమలాలి. ఇది మంచి డైజేషన్ కి ప్రేరేపిస్తుంది. సోంపులో మన కండరాలను రిలాక్స్ చేసే గుణాలు ఉన్నాయి. ఇది కడుపులో అజీర్తిని, గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది.
అల్లం.. అల్లం కూడా కడుపు సమస్యలకు మంచి నేచురల్ రెమెడీ. ఇది మంచి జీర్ణ ఆరోగ్యానికి, మంట సమస్య రాకుండా కాపాడుతుంది. అల్లం టీ, ఏవైనా క్యాండీలు తినవచ్చు. హెవీ మిల్స్ తిన్న తర్వాత అల్లాన్ని కాస్త గోరువెచ్చని నీళ్లలో వేసుకొని కూడా తాగొచ్చు. దీంతో కడుపు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి.
యాలకులు.. పచ్చని యాలకులు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. సాధారణంగా మనం వంటలు వండుకున్నప్పుడు యాలకులు వాడతాం. కానీ ఇది గ్యాస్ సంబంధిత సమస్యలు రాకుండా చెక్ పెడుతుంది. అజీర్తి, మలబద్ధకం సమస్యకు యాలకులు మంచి రెమెడీ. సరైన్ ఎంజైమ్ మన జీర్ణ ఆరోగ్యాన్ని బూస్టింగ్ ఇస్తుంది. అధికంగా తిన్న తర్వాత యాలకులను గింజలను నమిలిన ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది.
పుదీనా.. పుదీనా కూడా రిలాక్సింగ్ గుణాలు కలిగి ఉంటుంది. ఇది కడుపు సమస్యలు రాకుండా కాపాడుతుంది. పుదీనాతో తయారు చేసిన టీ ని తాగడం వల్ల మంచి రిలాక్సేషన్ వస్తుంది. అంతే కాదు ఇది కడుపులో కండరాలను నయం చేసే గుణాలను కలిగి ఉంటుంది. కడుపులో గ్యాస్ ,అజీర్తి సమస్యలు రాకుండా నివారిస్తుంది.
బొప్పాయి.. బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది కడుపులో ప్రోటీన్స్ ని విడదీయడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. డైజెషన్ ని మెరుగుపరుస్తుంది పండిన బొప్పాయి లేదా జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల కడుపు సమస్యలు రాకుండా ఉంటాయి. మంచి జీర్ణక్రియకు సహాయపడుతుంది.
యోగర్ట్.. యోగర్ట్ మంచి ప్రోబయోటిక్ రిచ్ ఫుడ్ ఇందులో మంచి బాక్టీరియా ఉంటుంది. ఇది కడుపుకు హాయిని ఇస్తుంది కడుపులో మంచి బ్యాక్టీరియా పెరగడానికి సహాయపడుతుంది. దీంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది ,స్వీట్ లేనిది యోగర్ట్ తీసుకుంటే సమర్థవంతంగా పనిచేస్తుంది.
సాధ్యమైనంతవరకు తక్కువగా తినడం అలవాటు చేసుకోండి కొద్దికొద్దిగా ఎక్కువసార్లు తీసుకోండి. హెవీ మీల్స్ ప్రతిసారి తీసుకోకూడదు అంతేకాదు ఫుడ్ కూడా బాగా నమిలి తింటే కడుపు సమస్యలు రావు ముఖ్యంగా ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడానికి ప్రయత్నించండి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )