Annabathuni shivakumar brutal attacks on voters in polling station Tenali: రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు ప్రశాంతంగా స్టార్ట్ అయ్యాయి. ఏపీలో 175, అసెంబ్లీ స్థానాలు, 25 లోక్ సభ స్థానాలకు గాను ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలు, కంటోన్మెంట్ పరిధిలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈసారి ఉదయం నుంచి జనాలు తమ ఓటు హక్కును వినియోగించు కోవడానికి ఆసక్తి చూపించారు. ఎన్నికల సిబ్బంది తమ ఓటింగ్ సామాగ్రితో నిన్న రాత్రి, తమకు కేటాయించిర పోలింగ్ బూత్ కు చేరుకున్నారు. ఈ రోజు ఉదయం ఐదు గంటలకు మాక్ పోలింగ్ నిర్వహించుకుని, అన్నిరకాల చెకప్ లు చేసుకున్నారు.ప్రజలు ఓటింగ్ వేసేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పలుమార్లు ఈవీఎంల పనితీరు, మాక్ పోలింగ్ చేసి మరీ చూశారు. ఇరు తెలుగు రాష్ట్రాలలో కూడా వాతావరణం కొంత చల్లగా ఉంది. ఏపీలో అనేక చోట్ల వర్షం కూడా కురిసింది. ఓటర్లు పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల నుంచి తమ సొంత స్థలాలలకు చేరుకున్నారు.
అన్నా బత్తుల శివ కుమార్ mla తెనాలి...
ఎమ్మెల్యే ను క్యూ లో రమ్మన్నదుకు..
ఒక ఓటరును కొట్టడం
ఓటరు mla ను కొట్టడం తో అక్కడ ఒక్కసారితో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.. pic.twitter.com/Qmygeym8KK— SKN (Sreenivasa Kumar) (@SKNonline) May 13, 2024
ఇప్పటికే ఈసీ రాజ్యంగం కల్పించిన ఓటుహక్కును ప్రజలంతా వినియోగించుకోవాలని సూచించింది. అనేక రకాల అవగాహాన కార్యక్రమాలు చేపట్టింది. రాజకీయ నేతలు కూడా తమకు నచ్చిన వారికి ఓటువేయాలని కూడా కోరారు. ఇదిలా ఉండగా.. ఆంధ్రప్రదేశ్ లోని తెనాలీలో ఎన్నికల కేంద్రంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక ఓటరు ఎమ్మెల్యే అభ్యర్థి చెంప చెళ్లు మన్పించాడు. ఈవీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు..
ఆంధ్రప్రేదేశ్ లో గతంలో లేని విధంగా ఈసారి ఓటర్లు ఉదయం నుంచి క్యూలో నిలబడ్డారు. తమ ఓటు హక్కును వినియోగించుకొవాలని స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఈ క్రమంలో వీఐపీలు, వయస్సులో పెద్దవారు, దివ్యాంగులు సైతం పోలింగ్ బూత్ లకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే.. తెనాలీలో ఒక ఎమ్మెల్యే అభ్యర్థి చేసిన పని ప్రస్తుతం తీవ్ర వివాదస్పదంగా మారింది. గుంటూరులోని తెనాలిలో ఓటింగ్ కార్యక్రమంప్రశాంతంగా సాగుతుంది. ఈ క్రమంలో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా బత్తుల శివ కుమార్ ఓటు వేయడానికి వచ్చారు. ఆయన క్యూలైన్ ను ఫాలో అవ్వకుండా నేరుగా, పోలింగ్ కేంద్రంలోపలికి ఓటు వేయడానికి వెళ్లారు.
ఈ నేపథ్యంలో అక్కడే ఉన్న ఒక ఓటరు క్యూలైన్ లో రావాలి కదా అని చెప్పాడు. దీంతో ఆవేశంతో ఊగిపోయిన అన్నా బత్తుల శివ కుమార్ తనకే నీతులు చెప్తావా.. అంటూ అతనిపై దాడికి దిగాడు. సదరు ఓటరు కూడా ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా బత్తుల శివ కుమార్ చెంప ఛెళ్లు మన్పించారు. ఎమ్మెల్యే అనుచరులు ఓటరుపై దాడికి దిగారు. చుట్టుపక్కల ఉన్న పోలీసులు.. వారిని ఆపే ధైర్యం మాత్రం చేయలేదు.
Read more: Dice Snakes: ఆస్కార్ లెవల్ పర్ఫామెన్స్.. చచ్చిపోయినట్లు నటిస్తున్న పాములు.. కారణం ఏంటో తెలుసా..?
కొందరు ఓటర్లు ఇదేం రౌడీయిజం అంటూ ఎమ్మెల్యే తీరును తప్పుపడుతున్నారు. ఈ వీడియో మాత్రం ప్రస్తుతం విపరీతంగా వైరల్ గా మారింది. దీనిపై టీడీజీ నేతలు మండిపడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును క్యూలో ఉండి వినియోగించుకొవాలని, ఇలా రౌడీల్లాగా దాడులు చేయడంఏంటని ఖండిస్తున్నారు. దీనిపై పోలీసులు, ఈసీ వెంటనే కఠినచర్యలు తీసుకొవాలంటూ కూడా టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter
AP Assembly Elections 2024: తిక్క కుదిరింది.. ఎమ్మెల్యేను పబ్లిక్ లో చెంపదెబ్బ కొట్టిన ఓటరు.. వైరల్ గా మారిన వీడియో..
తెనాలి పోలింగ్ బూత్ లో షాకింగ్..
పోలీసులు చర్యలు తీసుకొవాలని టీడీపీ డిమాండ్..