IPL 2024 CSK vs RR Live: ఈ సీజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఇంకా జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరుకోని విభిన్న పరిస్థితుల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు కీలక విజయాన్ని సాధించింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సమష్టి ప్రదర్శన కనబర్చి చెన్నై మ్యాచ్‌ను సొంతం చేసుకోగా.. రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌ను కోల్పోయినా కూడా ఇంకా ప్లే ఆఫ్స్ ఆశలు మాత్రం తగ్గలేదు. చిదంబరం స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఆర్ఆర్పై 5 వికెట్ల తేడాతో సీఎస్కే విజయం సాధించింది.
Also Read: IPL GT vs CSK: చెన్నైకి షాక్... గిల్, సాయి సుదర్శన్ భారీ సెంచరీలతో గుజరాత్‌కు అనూహ్య విజయం
టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 141కు పరుగులకు పరిమితమైంది. బ్యాటర్లు భారీగా స్కోర్ చేయడంలో విఫలమయ్యారు. ఒక్కరూ కూడా అర్ధ శతకం చేయలేకపోయారు. రియాన్ పరాగ్ చేసిన 47 స్కోర్ అత్యధిక పరుగులు. ధ్రువ్ జురేల్ (28), యశస్వి జైస్వాల్ (24), జోస్ బట్లర్ (21), కెప్టెన్ సంజూ శాంసన్ (15) పరుగులు చేశారు. ఓపెనర్ మొదలుకుని ఏ బ్యాటర్ కూడా బ్యాట్ ఝుళిపించడంలో తడబడ్డారు. రాజస్థాన్‌ను పరుగులు రాబట్టకుండా చెన్నై బౌలర్లు చక్కగా నియంత్రించారు. మితంగా బౌలింగ్ వేస్తూ వికెట్లు రాబట్టారు. సిమర్జిత్ సింగ్ 3 వికెట్లు తీసి సత్తా చాటగా.. తుషార్ దేశ్‌పాండే 2 వికెట్లు పడగొట్టాడు.
Also Read: IPL SRH vs LSG: ఉప్పల్‌లో హైదరాబాద్ అదుర్స్.. 10 ఓవర్లలోనే 10 వికెట్ల తేడాతో తిరుగులేని విజయం
స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ కొంత కష్టంగానే లక్ష్యం సాధించారు. 18.2 ఓవర్లలో 5 వికెట్లు నష్టానికి 145 పరుగులు సాధించి చెన్నై విజయం పొందింది. ఇక్కడ కూడా ఓపెనర్లు అంతగా ఆకట్టుకోలేకపోయారు. రచిన్ రవీంద్ర (27), కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (42), డేరిల్ మిచెల్ (22), మొయిన్ అలీ (10), శివమ్ దూబే (18), రవీంద్ర జడేజా (5), సమీర్ రిజ్వీ (15) పరుగులు జోడించారు. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడానికి రాజస్థాన్ గట్టిగానే పోరాడినా ఆఖర్లో తడబడింది. రవిచంద్రన్ అశ్విన్ 2 వికెట్లు తీయగా.. నంద్రె బర్గర్ , యజువేంద్ర చాహల్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
గెలిచి.. ఓడి ప్లేఆఫ్స్ రేసులోనే
తప్పక విజయం సాధించాల్సిన రాజస్థాన్ రాయల్స్ తడబడింది. ఓడినా కూడా ఇంకా ప్లేఆఫ్స్ రేసులోనే రాజస్థాన్ ఉండడం గమనార్హం. ఇక చెన్నై సూపర్ కింగ్స్ కీలక విజయాన్ని సాధించి రెండు పాయింట్లు ఖాతాలో వేసుకుని ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవం చేసుకుంది. తదుపరి జరిగే మ్యాచ్‌ల్లో ఈ రెండూ జట్లు తప్పక విజయం సాధిస్తేనే ముందడుగు వేసే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter