/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

Hanu Man 1st TRP Rating:హనుమాన్.. ఈ మూవీ ఈ యేడాది అత్య‌ధిక వ‌సూళ్ల‌ను సాధించిన సినిమాగా నిలిచింది. అంతేకాదు హిందీ బెల్ట్‌లో కూడా ఈ సినిమా ఇర‌గ‌దీసింది. ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపు రూ. 300 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించి సంక్రాంతి సినిమాల్లో కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. ఇక థియేట్రిక‌ల్‌గా మంచి వ‌సూళ్లనే రాబ‌ట్టిన ఈ సినిమా.. ఓటీటీ వేదిక‌గా ఈ సినిమా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా వ‌ర‌ల్డ్ టెలివిజ‌న్ ప్రీమియ‌ర్‌గా టెలికాస్ట్ అయితే ఈ సినిమాను ఓవ‌రాల్‌గా 10.26 టీఆర్పీ రేటింగ్ సాధించింది. ఈ మ‌ధ్య‌కాలంలో ఓ సినిమాకు ఈ రేంజ్ టీఆర్పీ రేటింగ్ సాధించడం మామ‌లు విషయం కాదు. అది కూడా ఓటీటీ హ‌వా న‌డుస్తోన్న ఈ టైమ్‌లో టీవీలో ఈ సినిమా ఫ‌స్ట్ టెలికాస్ట్‌లో మంచి రేటింగ్ సాధించింది.

ఇక బాక్సాఫీస్ దగ్గర హను మాన్ దూకుడు మొద‌టి రోజు ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నుంచి కొనసాగింది. విడుదలకు ఒక రోజు ముందు ప్రీమియర్స్ ద్వారానే దాదాపు రూ.3 కోట్లకు పైగా షేర్.. రూ. 6 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి ఈ రికార్డుల‌ను సాధించింది. అంతేకాదు హనుమాన్ మూవీ మీడియం రేంజ్ చిన్న చిత్రాల్లో  సరికొత్త బెంచ్ మార్క్  క్రియేట్ చేసింది. అంతేకాదు హనుమాన్.. విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని కొత్త సంచనాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది.  అంతేకాదు 2024లో తెలుగులోనే కాదు.. మన దేశంలోనే తొలి బంప‌ర్ హిట్‌గా నిలిచింది. అంతేకాదు యూఎస్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర  $ 5 మిలియన్ యూఎస్ కలెక్ట్ చేసి టాప్ 5లో నిలిచింది.

హనుమాన్ మూవీ రూ. 29.55 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 30.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన ఈ మూవీ  థియేట్రికల్‌గా రూ.100 కోట్లకు పైగా లాభాలను తీసుకొచ్చింది. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో మరే పెద్ద స్టార్ హీరోలకు సైతం సాధ్యం కానీ రికార్డులను నెలకొల్పింది. గత కొన్నేళ్గుగా ఓ సినిమా థియేట్రికల్‌గా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవడమే గగనమై పోతున్న ఈ రోజుల్లో ఈ మూవీ థియేట్రికల్‌గా రూ. 100 కోట్ల లాభాలను కొల్ల‌గొట్ట‌డం మాములు విష‌యం కాదు.  ఇదో రేర్ ఆఫ్ ది రేర్ అని చెప్పాలి.

ఈ సినిమా దాదాపు రూ. 300 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిన తొలి మీడియం రేంజ్ సంక్రాంతి సినిమాగా హనుమాన్గా నిలిచింది. హిందీలో 'హనుమాన్' రూ. 50 కోట్ల నెట్ వసూళ్లను సాధించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా తెలంగాణ, రెస్ట్ ఆఫ్ భారత్, ఓవర్సీస్, హిందీలో రూ. 50 కోట్ల గ్రాస్ అందుకున్న తొలి సినిమాగా స‌రికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. హనుమాన్ సినిమాను థియేటర్స్‌లో దాదాపు కోటి మందికి పైగా వీక్షించారు. అది కూడా మాములు రికార్డు కాదు.

హనుమాన్ సినిమా స్టోరీ విషయానికొస్తే.. అంజనాద్రి ప్రాంతంలో అల్లరి చిల్లరిగా తిరిగే హనుమంతుని వాళ్ల అక్క అంజనమ్మ పెంచి పెద్ద చేస్తోంది. ఆ తర్వాత ఆ ఊరిపెద్దగా ఉంటూ అరాచకాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో హనుమంతుడి శక్తులు పొందిన హనుమంతు దుర్మార్గుల‌ను ఎలా అంతం చేసాడ‌నేదే ఈ సినిమా స్టోరీ.  ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా జై హ‌నుమాన్ మూవీ తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా పై భారీ అంచ‌నాలే ఉన్నాయి.

Also Read: KTR: ఎన్నికల్లో 12 ఎంపీలు ఇవ్వండి.. కేసీఆర్‌ను సీఎం చేద్దాం: కేటీఆర్‌ పిలుపు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Hanu Man Movie creat highest trp rating 1st world television premier here are the details ta
News Source: 
Home Title: 

Hanu Man 1st TRP Rating: థియేట్రిక‌ల్‌గా ఓటీటీ వేదిక‌గానే కాదు.. టెలివిజ‌న్‌లో కూడా హను మాన్ మూవీ రికార్డు టీఆర్పీ..

Hanu Man 1st TRP Rating: థియేట్రిక‌ల్‌గా ఓటీటీ వేదిక‌గానే కాదు.. టెలివిజ‌న్‌లో కూడా హను మాన్ మూవీ రికార్డు టీఆర్పీ..
Caption: 
Hanu Man Movie Record TRP (X/Source)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
థియేట్రిక‌ల్‌గా ఓటీటీ వేదిక‌గానే కాదు.. టెలివిజ‌న్‌లో హను మాన్ రికార్డు టీఆర్పీ
TA Kiran Kumar
Publish Later: 
Yes
Publish At: 
Saturday, May 11, 2024 - 07:44
Created By: 
Kiran Kumar
Updated By: 
Kiran Kumar
Request Count: 
18
Is Breaking News: 
No
Word Count: 
409