Moodami Periods we can also perform these Events: హిందు సంప్రాదాయం ప్రకారం మనం అనాదీగా కొన్ని ఆచారాలు, పద్ధతులను పాటిస్తుఉంటాం. ముఖ్యంగా జీవితంలోని కొన్నిముఖ్యమైన ఘట్టాలకు గ్రహాలు, రాశుల స్థానం, శుభ మూహుర్తాలు వంటివి తప్పకుండా చూస్తుంటారు. అయితే.. క్రోధి నామసంవత్సరంలో మాత్రం దాదాపుగా మూడు నెలల పాటు శుభమూహుర్తాలు లేవని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా గురు, శుక్రమూఢాల కారణంగా ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. అయిన కూడా కొన్ని పనులను మూఢాలున్న కూడా చేసుకోవచ్చని పండితులు చెబుతున్నారు.
మూఢాలలో ఈ పనులు చేసుకోవచ్చు..
అన్న ప్రాసన: చిన్న పిల్లలకు తొలిసారిగా అన్నం తినిపించడానికి ఈ వేడుకను నిర్వహిస్తారు. కొందరు వారి ఇంటి దేవస్థానంలో అన్నప్రాసన కార్యక్రమం నిర్వహిస్తుంటారు. మెయిన్ గా తమ తమ శక్తి కోలది కొందరు బంగారుగిన్నెలో, మరికొందరు వెండి పళ్లేంలో పరమాన్నం,లేదా పాయసం చేయించి దేవుడికి అర్పించి ఆతర్వాత పిల్లాడికి అన్నప్రాసన చేయిస్తారు. ఈ వేడుక అనేది మూఢాలున్నకూడా చేసుకోవచ్చు.
భూములు అమ్మడం లేదా కొనడం:
కొన్నిసార్లు అనుకోకుండా భూములు తక్కువ ధరకు దొరుకుతుంటాయి. అమ్మే వ్యక్తికి ఏదైన అత్యవసమై అమ్ముతుంటాడు. ఈ సమయంలో ఇప్పుడు మూఢం ఉంది కదా అని ఆలోచించాల్సిన అవసరం లేదు. నిరభ్యతరంగా భూమిని కొనుగోలు చేసుకోవచ్చు. దీని వల్ల ఎలాంటి చెడు ప్రభావం ఉండదు. ఇక భూమిని అమ్మాల్సిన పరిస్థితి వచ్చిన కూడా అమ్మేయోచ్చు.
సీమంత చేసుకోవడం:
మహిళలు జీవితంలో సీమంతం అనేది ఒక ముఖ్యమైన ఘట్టం. దీన్నిజరుపుకోవడానికి మూఢాలు అడ్డుగా ఉన్నాయని ఆలోచించాల్సిన అసవరం లేదని పండితులు చెబుతున్నారు. మూఢాలున్నకూడా సీమంతం వేడుకను నిర్వహించుకోవచ్చు.
నామకరణాలు: పుట్టిన బిడ్డకు నామకరణం చేసుకొవడానికి కూడా మూఢాలు చూడాల్సిన అవసం లేదు. తమ ఇంట్లో ఉన్న ఆచారం, పద్ధతులను బట్టి నామకరణం వేడుకలను ఎలాంటి అనుమానం లేకుండా చక్కగా చేసుకోవచ్చు.
విదేశీ విద్యకు వెళ్లడం:
కొందరికి ఉన్నత చదువుల కోసం, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లే ఆఫర్ వస్తుంది. ఇలాంటి వారు ఇప్పుడు మూఢాలున్నాయి కదా అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఫారెన్ కు వెళ్లిపోవచ్చు. తమ చదువులు, ఉద్యోగాలలో జాయిన్ అయిపోవచ్చు.
కొత్త వాహనాలు కొనడం:
కొత్తగా టూవీలర్ లేదా ఫోర్ వీలర్ వాహానలు కొనేవారు మూఢాలున్నాయని ఆగాల్సిన అవసరం లేదు. మూఢాలున్న కూడా కొత్త వాహానలను సంతోషంగా కొనుగోలు చేయోచ్చు. దీనికి ఎలాంటి మూఢం వర్తించదని పండితులు చెబుతున్నారు.
హోమం, నక్షత్ర శాంతులు:
చాలా మంది ఇంట్లో మంచి జరగాలని వినాయక హోమం, చండీయాగం, రాజశ్యామల యాగం, నవగ్రహాం హోమం, నక్షత్ర శాంతులు జరిపిస్తుంటారు. అయితే మూఢాలున్న కూడా ఈ కార్యక్రమాలను ఎలాంటి అనుమానం లేకుండా చేసుకోవచ్చు.
అగ్రిమెంట్లు చేసుకోవడం:
ఏదైన భూమి కొనుగోలు, అమ్మకానికి సంబంధించిన అగ్రిమెంట్లు చేసుకోవచ్చు. ఇళ్లు కొనాలనుకున్నవారు లేదా రియల్ ఎస్టేట్ రంగంలో ప్లాట్ లు కొనాలనుకుంటున్నవారు అన్నిరకాల అగ్రిమెంట్లను చేసుకోవచ్చు. దీని వల్ల ఎలాంటి మూఢం ప్రభావం ఉండదు.
ముఖ్యంగా పై కార్యక్రమాలు మూఢాలున్న కూడా ఎలాంటి అనుమానం లేకుండా చేసుకోవచ్చని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
Read more: Shanidev Remedies: ఏలినాటి శని ప్రభావంతో బాధపడుతున్నారా..?.. ఈ సింపుల్ రెమీడీలు మీకోసమే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter