Man Collapses And Dies In Wedding Rajasthan: పెళ్లి వేడుకను అందరు తమ జీవితంలో గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేసుకొవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. దీని కోసం ఎంత ఖర్చు చేయడానికైన వెనుకాడరు. అంతేకాకుండా.. పెళ్లి కోసం యువత అనేక రకాల ప్లాన్ లు వేసుకుంటారు. పెళ్లి చూపుల నుంచి అప్పగింతల వరకు ప్రతిదీ స్పెషల్ గా ఉండేలా చూసుకుంటారు. దీని కోసం వెడ్డింగ్ ఆర్గనైజర్స్ లను కలిసి ప్లాన్ లు చేస్తారు. జీవితంలో ఒక్కసారి మాత్రమే జరిగే ఈ వేడుకను బంధువలు, స్నేహితులంతా గుర్తుంచుకునేలా చేయాలని ప్లాన్ లు చేసుకుంటారు. ఈ మధ్య కాలంలో పెళ్లి వేడుకలలో అనుకోని ఘటనలు జరుగుతున్నాయి.
మేనల్లుడి పెళ్లి వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ గుండె ఆగి మృతి చెందిన మామ
ఇటీవల రాజస్థాన్‌లో మేనల్లుడి పెళ్లిలో మామ కమలేశ్ సంప్రదాయబద్ధంగా తలపై కుండ పెట్టుకుని డీజే పాటలకు మట్కా డ్యాన్స్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలాడు.
వెంటనే ఆస్పత్రికి తరలించగా, గుండె ఆగిపోవడం వల్లే చనిపోయాడని… pic.twitter.com/koIjvKlsVo
— Telugu Scribe (@TeluguScribe) April 26, 2024
ముఖ్యంగా పెళ్లి బరాత్ లో డ్యాన్స్ చేస్తుండగా కుప్పకూలీ చనిపోవడం, పెళ్లి వేడుకలలో.. డాన్సులు చేస్తుండగా స్పృహ తప్పి పడిపోవడం వంటి ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలలో ముఖ్యంగా చిన్న పిల్లలు, మధ్య వయస్కుల వారు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. అందరి ముందు పుల్ ఎంజాయ్ చేసిన వాళ్లు నిముషాల వ్యవధిలోనే విగతజీవులుగా మారిన ఘటనలు అనేకం వైరల్ గా మారాయి ఈ కోవకు చెందిన మరో ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పూర్తివివరాలు..
రాజస్థాన్ లోని ఇటీవల పెళ్లి వేడుకలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. జుంజును జిల్లాలోని నవాల్ ఘర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. రాజస్థాన్ లో పెళ్లి వేడుక సందర్భంలో.. తలపై కుండను పెట్టుకుని మట్కా డ్యాన్స్ చేస్తుంటారు. ఇలా చేయడం వారి ఆచారం. తరతరాలుగా ఈ ఆచారంను వాళ్లు పెళ్లిలో పాటిస్తువస్తున్నారు. ఇదిలా ఉండగా..తన మేనల్లుడి పెళ్లికి కూడా.. కమలేష్ ఇలానే సంప్రదాయ బద్దంగా కుండలను తలపై పెట్టుకుని డ్యాన్స్ చేస్తున్నాడు. అందరి కంటే జోష్ గా పెళ్లిలో ఉత్సాహంగా పాల్గొన్నాడు.
ఏంజరిగిందోకానీ తెలియదు. డ్యాన్స్ చేస్తుంగా.. ఒక్కసారిగా కుప్పకూలీపడిపోయాడు. చుట్టుపక్కల వారంతా షాక్ కు గురయ్యారు. వెంటనే సదరు వ్యక్తినిదగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. అతగాడిని టెస్ట్ చేసిన వైద్యులు.. హార్ట్ ఎటాక్ వల్ల చనిపోయాడని తెలిపారు. దీంతో కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం నెలకొంది. పెళ్లింట ఎంజాయ్ చేయడానికి వచ్చి, ఇలా మామ.. విగత జీవిగా మారడం చూసి అక్కడున్న వారంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ఘటనకు చెందిన వీడియోసోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దీనిపై డాక్టర్లు.. చెబుతూ.. వ్యక్తి డాన్స్ చేస్తు ఆయాసపడినట్లు తెలుస్తోంది. అనుకోకుండా స్ట్రోక్ రావడంతో చనిపోయాడని తెలిపారు. ఇదిలా ఉండగా.. ఒకప్పుడు గుండెజబ్బులు అనేది యాభై ఏళ్ల వయస్సు దాటాక మాత్రమే కన్పించేది. కానీ ఇప్పుడు మాత్రం చిన్న పిల్లలు, మువతలో గుండె జబ్బులు ఎక్కువగా మారాయి.ముఖ్యంగా యువతలు మానసికంగా ఒత్తిడికి గురవ్వడం, టెన్షన్ ల వల్ల గుండె జబ్బులకు గురిఅవుతున్నట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter