Healthy Lifestyle: రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు.. బీపీ షుగర్ మీ జోలికి కూడా రావు..

Health Tips : బీపీ, షుగర్ ఈమధ్య బాగా కామన్ ప్రాబ్లమ్స్ అయిపోయాయి. కానీ వీటిని నియంత్రించటం పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. మన ఆహార అలవాటు లైఫ్ స్టైల్ మీదే ఆధారపడి ఉంటుంది. ప్రతిరోజు తప్పకుండా ఈ పని చేస్తే బీపీ, షుగర్ కాదు కదా గుండె జబ్బులు కూడా మీ దరిదాపుల్లోకి రావు.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Apr 25, 2024, 03:43 PM IST
Healthy Lifestyle: రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు.. బీపీ షుగర్ మీ జోలికి కూడా రావు..

Health Tips : ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే దాకా ఎన్నో పనులతో బిజీగా ఉంటాం. ఇటు ఇంట్లో పనులు అటు ఆఫీస్ పనులు చేసుకుని మనకంటూ మనం సమయాన్ని కేటాయించుకోలేకపోతుంటాం. ఇప్పుడు బాగానే ఉన్నప్పటికీ కొనేళ్ల తర్వాత అదే మనం చేసిన పెద్ద తప్పు అవుతుంది. మన ఆరోగ్యాన్ని మన చేతుల్లో ఉన్నప్పుడే కాపాడుకోవాలి.

ప్రతిరోజు మనకోసం మనం ఎంతో కొంత సమయాన్ని కేటాయించుకుంటూ ఉండాలి. ఈ బిజీ జీవితంలో కనీసం అరగంట లేదా గంట అయినా మన కోసం మన ఆరోగ్యం కోసం వెచ్చించాల్సి ఉంటుంది. సమయం అంటే ఊరికే ఫోన్ పట్టుకుని కూర్చోకుండా పచ్చని చెట్ల మధ్యకి వెళ్లి పార్కులోనో లేదా ఏదైనా ఆహ్లాదకరమైన ప్రదేశంలోనో వాకింగ్ చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యల నుండి తప్పించుకోవచ్చు. 

ఊరికే నడవడం వల్ల ఏమొస్తుంది అని కొందరు అనుకుంటారు కానీ డైలీ వాకింగ్ చేయడం వల్ల మధుమేహం, బ్లడ్ ప్రెషర్, గుండె జబ్బులు ఇలాంటి ఎన్నో రోగాల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. రోజు కుదిరితే గంట లేదా కనీసం అరగంట అయినా వాకింగ్ చేస్తే మన ఆరోగ్యానికి ఎంతో మంచిది అని వైద్య నిపుణులే చెబుతున్నారు.

పచ్చని చెట్ల మధ్యలో ప్రకృతికి దగ్గరగా వాకింగ్ చేయడం వల్ల మానసిక ఒత్తిడి చాలా తగ్గుతుంది. మన మానసిక ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడుతుంది. బీపీ కూడా నియంత్రణ అవుతుంది. 

శరీరంలో ఇన్ఫ్లమేషన్ బాగా పెరిగితే గుండె జబ్బులు, షుగర్ వంటి ఎన్నో ఇబ్బందులు వస్తాయి. దానివల్ల రక్తనాళాలు దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. దానివల్ల గుండె కి రక్త ప్రవాహం తగ్గిపోతుంది. అదే భవిష్యత్తులో గుండెపోటుకి దారితీస్తుంది.

ఇన్ఫ్లమేషన్ చాలా ప్రమాదకరమైనది. అది శరీరంలో గ్లూకోజ్ ను, ఇన్సులిన్ లెవెల్స్ ను ప్రభావితం చేస్తుంది. అందుకే శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికోసం మనం చేయగలిగింది రోజూ వాకింగ్ చేయడం..

దాదాపు 1000 మందికి పైగా పాల్గొన్న ఒక పరిశోధనలో డాక్టర్లు కూడా ప్రకృతిలో ఎక్కువ సమయం గడిపిన వారు మిగతా వారితో పోలిస్తే చాలా ఆరోగ్యంగా ఉన్నట్లు తేల్చి చెప్పారు. అందుకే ఎంత బిజీ జీవితంలో అయినా మనకంటూ మనం కొంత సమయాన్ని వెచ్చించి ప్రకృతికి దగ్గరగా గడిపితే మన ఆరోగ్యాన్ని మనం పదిలంగా చూసుకోవచ్చు.

Also read: Pink Mooon: ఆకాశంలో అద్భుతం, తెల్లవారుజామునే పింక్ మూన్, ఎన్ని గంటలకంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News