మాళవిక శర్మ తెలుగులో రవితేజ హీరోగా నటించిన 'నేల టిక్కెట్టు' మూవీతో పరిచయమైంది. ఈ సినిమా పెద్దగా సక్సెస్ సాధించకపోవడంతో పెద్దగా బ్రేక్ రాలేదు.నేల టిక్కెట్టు మూవీలో బాక్సాఫీస్ దగ్గర పర్ఫామ్ చేయకపోయినా.. ఇందులో మాళవిక అందాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
మాళవిక శర్మ విషయానికొస్తే.. హీరోయిన్గా కెరీర్ కంటిన్యూ చేస్తూనే న్యాయవాద వృత్తిని కొనసాగిస్తోంది. తెలుగులో నేల టిక్కెట్టు తర్వాత రామ్ పోతినేని సరసన 'రెడ్' మూవీలో నటించింది. ఈ సినిమా కూడా పెద్దగా హిట్ కాలేదు.
అటు తెలుగుతో పాటు తమిళంలో 'కాఫీ విత్ కాతల్' మూవీతో పలకరించింది. ఈ సినిమా కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు.
రీసెంట్గా గోపీచంద్ హీరోగా నటించిన 'భీమా' మూవీలో నటించింది. ఈ సినిమా కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. మాళవిక నటిగ కాకముందు మోడల్‌గా పలు ఉత్పత్తులకు ప్రచార కర్తగా వ్యవహరించింది. 2017లో హిమాలయా, డెట్టాలో, మలబార్ వంటి కొన్ని టీవీ ప్రకటనల్లో కనిపించింది.
మాళవిక పర్సనల్ విషయాలకు వస్తే.. నటి, మోడల్ మాత్రమే కాదు ఆమె ఓ న్యాయవాది కూడా. మాళవిక తన కాలేజీ రోజుల్లో మోడల్‌గా కెరీర్‌ని ప్రారంభించింది. అందులో భాగంగా ఆమె 2017లో హిమాలయా, డెట్టాల్, మలబార్ వంటి కొన్ని టీవీ ప్రకటనలలో కూడా కనిపించింది.
మాళవిక శర్మ.. 1999 జనవరి 26న ముంబైలో జన్మించింది. ఈమె కుటుంబం ఉత్తరాదికి చెందినవారు. చదువు కొనసాగిస్తూనే హీరోయిన్గా కెరీర్ మొదలు పెట్టి.. అటు న్యాయవాద వృత్తిలో కొనసాగిస్తోంది.