How To Control Diabetes Without Medicine: ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం, ప్రతిరోజు ఎక్కువగా అనారోగ్యకరమైన ఆహారాలకు తీసుకోవడం కారణంగా చాలామంది చిన్న వయసులోనే మధుమేహం బారిన పడుతున్నారు. ముఖ్యంగా 20 సంవత్సరాల పైబడిన వారి ఈ డయాబెటిస్ బారిన పడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు ఈ సంఖ్య పెరగడంతో వైద్యులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. నిజానికి మధుమేహం కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే ఈ సమస్యతో బాధపడే వారు తప్పకుండా కొన్ని రకాల ఆహారాలు ప్రతిరోజు తీసుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా ఉదయాన్నే తీసుకునే అల్పాహారంలో ఈ ఐదు రకాల ఆహారాలు ఉండేటట్లు తప్పకుండా చూసుకోండి.
మధుమేహంతో బాధపడేవారు తప్పకుండా ఉదయం పూట అల్పాహారానికి ముందు బాదం వాల్‌నట్స్‌ను తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఎండు ద్రాక్ష జీడిపప్పును తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. అలాగే వీటిని రాత్రి నిద్రపోయే ముందు తీసుకోవడం కూడా ఎంతో మంచిది. అలాగే డయాబెటిస్ ఉన్నవారు తప్పకుండా బొప్పాయి పండును తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్ గుణాలు పీచు పదార్థాలు రక్తంలోని చక్కర పరిమాణాలను నియంత్రించేందుకు ఎంతగానో సహాయపడతాయి. అంతేకాకుండా జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచేందుకు కూడా ప్రభావవంతంగా కృషి కృషి చేస్తాయి.
ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత తప్పకుండా అల్పాహారంలో భాగంగా మధుమేహంతో బాధపడేవారు మొలకెత్తిన మెంతులను తీసుకోవడం కూడా ఎంతో మంచిది ఇందులో ఉండే ఫైబర్ సులభంగా మధుమేహాన్ని నియంత్రించేందుకు ఎంతగానో సహాయపడుతుంది. దీంతో పాటు చక్కెర పరిమాణాలను తగ్గించేందుకు కూడా దోహదపడతాయి. అలాగే ప్రతిరోజు ఉదయం పూట దాల్చిన చెక్కతో తయారుచేసిన టీని కూడా తీసుకోవడం ఎంతో మంచిది. దీనిని తీసుకోవడం వల్ల బరువు కూడా తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా డయాబెటిస్తో బాధపడేవారు దాల్చిన చెక్కతో తయారు చేసిన పొడిని వివిధ రకాల ఆహారాల్లో వినియోగించి కూడా తీసుకోవచ్చు.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
మధుమేహంతో బాధపడేవారు ఉదయం పూట పెసరపప్పుతో తయారు చేసిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఈ పప్పు తక్కువ గ్లైసేమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు తీసుకోవడం వల్ల చక్కెర పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయి. ప్రతిరోజు వ్యాయామాలు చేసిన తర్వాత మాత్రమే అల్పాహారాలు తీసుకోవడం ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల సులభంగా రక్తం లోని చక్కర పరిమాణాలను నియంత్రించుకోవచ్చు.
నోట్: ఇక్కడ అందించిన సమాచారం కేవలం ఆరోగ్య నిపుణులు సూచించినవే కాబట్టి ఈ ఇంటి చిట్కాలు వినియోగించే క్రమంలో తప్పకుండా వైద్యుల సూచనలు సలహాలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. ఈ సమాచారం జీ తెలుగు న్యూస్ ఎట్టి పరిస్థితుల్లో ధృవీకరించదు..
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి