Fast Hair Growth Home Remedies: పొడవైన, ఒత్తైన జుట్టు కోసం ఆడ, మగ తేడా లేకుండా కేశాల పట్ల ఎంతో జాగ్రత్త వహిస్తూ ఉంటారు. ప్రస్తుత కాలంలో మారిన ఆహారపు అలవాట్లు కారణంగా చాలామంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతూ అన్నారు. ముఖ్యంగా యువతి, యువకులు జుట్టు పట్ల ఎంతో జాగ్రత్తలు వహిస్తున్నారు. అయితే ఈ జుట్టు పెరుగుదల కోసం చాలా మంది కొన్ని రకాలు ప్రోడెక్ట్స్, షాంపూలకు ఖర్చు చేస్తూ ఉంటారు. కానీ దీని వల్ల ఎలాంటి ప్రయోజనంఉండదు. అయితే కొన్ని సహాజమైన చిట్కాలను పాటించడం వల్ల జుట్టు సమస్యకు చెక్ పెట్టవచ్చు అంటున్నారు నిపుణులు.
ముఖ్యంగా ఇంట్లో ఎల్లప్పుడు ఉపయోగించే మెంతులతో జుట్టు సమస్యలకు గూడై బై చెప్పవచ్చు. మెంతులు జుట్టుకు ఎంతో ఉపయోగపడతాయి. ఇది చుండ్రును తొలగించడంలో ఏంతో మేలు చేస్తుంది. అంతేకాకుండా మెంతులతో పాటు ఆయిల్, కొబ్బరి నూనె, ఆముదం కలిపి తీసుకోవడం వల్ల మీరు పొడవైన ఆరోగ్యవంతమైన జుట్టుని పొందవచ్చు. ఈ నూనెతో రాత్రిపూట హెడ్ మసాజ్ చేసుకొని మార్నింగ్ తల స్నానం చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
దీంతో పాటు జుట్టు పెరుగుదలకు గ్రీన్ టీ కూడా ఎంతో సహాయపడుతుంది. గ్రీన్ టీ వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫోలికల్స్ హెయిర్ పెరుగుదలతో కీలక ప్రాత పోషిస్తాయి. అలాగే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయడుతుంది. హెయిర్ లాస్‌కు ఉల్లిపాయ రసం ఎంతో మేలు చేస్తుంది. దీనిని ఉపయోగించడం వల్ల హెయిర్ హెల్దీనెస్‌తో పాటు గ్రోత్ కూడా ఉంటుంది. జుట్టు ఆరోగ్యంగా ఉండాలి అంటే పాలకూర, క్యారెట్, బీన్స్, బచ్చలికూర వంటి ఆహారపదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు బాదం, జీడిపప్పు, ఎండు ద్రాక్ష తీసుకోవాలి.
జుట్టు పెరుగుదలకు కొన్ని రకాల పండ్లు కూడా సహాయపడుతాయి. దీని కోసం మీరు దానిమ్మ, అరటి, ఆరెంజ్ తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు కులుగుతాయి. అలాగే మాంసం తీసుకోవాలి ఉంటుంది. దీని వల్ల విటమిన్ బి-12 శరీరానికి సహాయపడుతుంది. గుడ్లు, చేపలు వంటి వాటికి మీ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల జుట్టు బలంగా ఉంటుంది. దీంతో పాటు మీకు మద్యం అలవాటు ఉంటే దీని కారణంగా కూడా హెయిర్ లాస్ అవుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
ఈ పైన చెప్పిన చిట్కాలను పాటించడం వల్ల మీరు పొడవైన, ఆరోగ్యకరమైన జుట్టును పొందవచ్చు. మీకు అధికంగా జుట్టు సమస్యల కలుగుతుంటే వైద్యుడిని సంప్రదించడం చాలా మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి