No Fortune In Dowry Husband Brutally Killed His Wife In Greater Noida: కొందరు మగాళ్లు షాడిస్టుల మాదిరిగా ప్రవర్తిస్తున్నారు. పెళ్లి సమయంలో అడిగినంత కట్నం ఇవ్వకుంటే భార్యను వేధిస్తుంటారు. మరికొందరు పెళ్లి తర్వాత కూడా.. కట్నం పేరుతో భార్యను, అత్తామామలను ఇబ్బందులకు గురిచేస్తుంటారు. ఇల్లుకావాలని, బంగారం కావాలని, భూములు తన పేరుతో రాసివ్వాలంటూ వేధిస్తుంటారు. ఇక పొరపాటున అమ్మాయిలు పుడితే, మరల కట్నం ఇవ్వాలని వేధింపులకు గురిచేస్తుంటారు. ఇది మనకు తరచుగా తెలిసిందే. కొందరైతే అడిగినంత కట్నం ఇవ్వకుంటే..భార్యలను వేధించడంతో పాటు, చంపడానికి కూడా వెనుకాడరు. తమ పిల్లలను సైతం చంపుకుంటారు. అచ్చం ఈ కోవకు చెందిన షాకింగ్ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు..
ఉత్తర ప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మహిళ సోదరుడు తెలిపిన వివరాల ప్రకారం, ఆమె కుటుంబం పెళ్లి సమయంలో వరుడి కుటుంబానికి ₹ 11 లక్షల విలువైన బంగారంతో పాటు ఒక SUVని ఇచ్చినట్లు తెలిపారు. 2022 సంవత్సరంలో.. కరిష్మాకు,వికాస్ ల పెళ్లి జరిగింది. అప్పటి నుంచి భార్యను ఇంకా డబ్బులు కావాలని వేధిస్తుండేవాడు. అయితే, వికాస్ కుటుంబం కొన్నేళ్లుగా ఎక్కువ కట్నం డిమాండ్ చేస్తూనే ఉన్నాడు. కరిష్మాను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తోందని అతను ఆరోపించాడు.
ఆమె ఆడపిల్లకు జన్మనిచ్చిన తర్వాత వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. వికాస్, కరిష్మాలను.. గ్రామంలో అనేక పంచాయతీ సమావేశాల ద్వారా రెండు కుటుంబాలు తమ విభేదాలను పరిష్కరించడానికి ప్రయత్నించారు. కరిష్మా కుటుంబం అతని కుటుంబానికి మరో ₹ 10 లక్షలు చెల్లించింది. అయిన కూడా అతగాడి వేధింపులు ఆగలేదని దీపక్ ఆరోపించారు.ఈ క్రమంలోనే.. మరో ఫార్చూనర్ కారు, రూ. 21 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈక్రమంలో కరిష్మాను భర్త ఇష్టమోచ్చినట్లు కొట్టి హత్య చేశాడు. ఆ తర్వాత ఏది జరగనట్లు కరిష్మాకుటుంబానికి సమాచారం అందించాడు. బాధిత మహిళ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తమ కూతురును, వికాస్ అతని తల్లిదండ్రులు కలిసి హత్య చేసినట్లు యువతిని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook