Muskmelon Seeds Benefits: వేసవికాలం ప్రారంభం కాగానే చాలామంది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకునేందుకు జ్యూస్‌లను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. చాలామంది ఈ సమయంలో ఎంతో ఇష్టంగా మామిడి పండ్లతో పాటు గ్రేప్స్ తో తయారుచేసిన పండ్ల రసాలను ఎక్కువగా తాగుతూ ఉంటారు. అంతేకాకుండా మరికొంతమంది అయితే మస్క్ మిలన్ తో తయారు చేసిన జ్యూస్‌ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఈ మస్క్ మిలన్ లో శరీరానికి కావాల్సిన ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్, జింక్, పొటాషియం, మాంగనీస్, సోడియం, కాల్షియం అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి దీనితో తయారుచేసిన జ్యూస్ని తాగడం వల్ల శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. అంతేకాకుండా వేడి కారణంగా వచ్చే ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. అయితే చాలామంది ఇంట్లో మస్క్ మిలన్(muskmelon)తో జ్యూస్‌ను తయారు చేసే క్రమంలో దాని నుంచి గింజలను వేరుచేసి బయటపడేస్తూ ఉంటారు. నిజానికి గింజల్లో కూడా శరీరానికి కావాల్సిన అనేక రకాల పోషక గుణాలు లభిస్తాయి. కాబట్టి గింజలను ఎండబెట్టి తీసుకోవడం వల్ల రెట్టింపు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గింజలను తీసుకోవడం వల్ల శరీరానికి కలిగే లాభాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పుచ్చకాయ గింజలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
టైప్-2 డయాబెటిస్ నివారణ:
మస్క్ మిలన్ (kharbuja fruit) గింజలను ప్రతిరోజూ తీసుకోవడం వల్ల టైప్-2 మధుమేహం నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. ఎండబెట్టిన ఈ గింజలను తీసుకోవడం వల్ల మైగ్రేన్, నిద్రలేమి, డిప్రెసివ్ డిజార్డర్ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ఇతర దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఉంటాయి.
బరువు తగ్గడం:
బరువు తగ్గడానికి చాలామంది అనేక రకాల డైట్లను పాటిస్తూ ఉంటారు. నిజానికి ప్రతి డైట్‌లో మస్క్ మిలన్ (muskmelon) గింజలను వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇందులో ఉండే ఫైబర్ శరీరాన్ని ఎక్కువ సేపు హైడ్రేట్‌గా ఉంచుతాయి. అంతే కాకుండా ఆకలిని నియంత్రించి పొట్టని ఎక్కువ సేపు నిండుగా ఉంచేలా చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి దీని కారణంగా సులభంగా బరువు తగ్గుతారు.
రోగ నిరోధక శక్తి పెరుగుతుంది:
మస్క్ మిలన్ విత్తనాలలో అధికమవుతాదులో విటమిన్ సి తో పాటు యాంటీ యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు దీనితో తయారు చేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచేందుకు కూడా ఎంతగానో సహాయపడతాయి. కాబట్టి తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ఈ మస్క్ మిలన్ (muskmelon) గింజలను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతే కాకుండా ఇందులో ఉండే గుణాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు కూడా సహాయపడతాయి.
రక్తపోటు సమస్యలకు చెక్:
తరచుగా రక్తపోటు సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు మస్క్ మిలన్ (kharbuja fruit) విత్తనాలను ఆహారంలో తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా రక్తపోటు సమస్యలు కూడా నియంత్రణలో ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తరచుగా ఆహారంలో ఈ గింజలను తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొవ్వు కూడా పెరుగుతుంది. దీని కారణంగా గుండె సమస్యలు రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ఫైబర్ సులభంగా అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి