Gastric Problem Causes In Telugu 2024: ప్రస్తుతం చాలామందిలో గ్యాస్ట్రిక్ అనేది పెద్ద సమస్యగా మారింది. ఈ సమస్య బారిన చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ పడుతున్నారు. ముఖ్యంగా ఈ గ్యాస్ట్రిక్ సమస్య కూర్చొని పనిచేసే వారిలో ఎక్కువగా వస్తోంది. ఆధునిక జీవన సైదులు కారణంగా తరచుగా అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం, ఆహారాలు తీసుకున్న వెంటనే గంటల తరబడి కూర్చోవడం కారణంగా ఈ గ్యాస్టిక్ సమస్య వస్తోంది. ముఖ్యంగా ఆఫీసుల్లో పని చేసే వారికి ఈ సమస్య ఒక శాపంగా మారుతోంది. పొట్టలోని గ్యాస్ కదలికల కారణంగా చాలామందిలో పొట్టనొప్పి, ఛాతీ నొప్పి వంటి సమస్యలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఈ సమస్యతో బాధపడేవారు తప్పకుండా ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. చిన్న వయసులో కూడా ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తున్నాయి. ఇలా రావడానికి కారణాలు ఏంటో? ఇప్పుడు మనం తెలుసుకుందాం.
గ్యాస్ట్రిక్ సమస్య రావడానికి 5 కారణాలు:
ఆహారపు అలవాట్లు:
సరైన సమయాల్లో ఆహారాలు తీసుకోకపోవడం కారణంగా కూడా కొంతమంది గ్యాస్ట్రిక్ సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా అధికంగా పులుపు ఉండే ఆహారాలు తీసుకోవడం, వేయించిన జిడ్డు గల ఆహారం తీసుకోవడం కారణంగా కూడా గ్యాస్టిక్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరికొంతమందిలోనైతే కార్బోనేటెడ్ అధికమవుతాదిలో ఉండే పానీయాలు, టీలు తాగడం కారణంగా కూడా గ్యాస్టిక్ సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయి.
జీవనశైలి:
ఆధునిక జీవనశైలిని పాటించే చాలా మందిలో గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శారీరక శ్రమ లేకపోవడం తగినంత నిద్ర లేకపోవడం కారణంగా కూడా కొంతమందిలో ఈ సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరికొంతమందిలోనైతే అధికంగా ఒత్తిడి పెరగడం, ఆందోళన, మద్యపానం సేవించడం, ధూమపానం సేవించడం కారణంగా కూడా ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు రావచ్చు. కాబట్టి చిన్న వయసులోనే ఈ సమస్య బారిన పడకుండా ఉండడానికి జీవనశైలిలో మార్పులు చేర్పులు తప్పకుండా చేసుకోవాల్సి ఉంటుంది.
మందులు వాడడం వల్ల కూడా గ్యాస్టిక్ సమస్య వస్తుంది:
పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లు అతిగా వినియోగించడం కారణంగా కూడా కొంతమందిలో గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. కొంతమంది లోనైతే యాంటీబయాటిక్స్, న్ని రకాల స్టెరాయిడ్స్ అతిగా వాడడం వల్ల కూడా ఈ సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గ్యాస్ సమస్యలు రాకుండా ఉండడానికి వీటిని అధిక వినియోగించుకోకపోవడం చాలా మేలు.
ఇతర కారణాలు:
అధిక బరువు ఉన్న వారిలో కూడా సులభంగా గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా స్త్రీలలో నైతే గర్భాధారణ సమయంలో గ్యాస్ సమస్య రావడం సాధారణమని వారు అంటున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు అతిగా మార్కెట్లో లభించే రసాయనాలతో కూడిన టాబ్లెట్స్ కి బదులుగా కొన్ని ఇంటి చిట్కాలు వినియోగించడం మేలు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి