Kishan Reddy On Phone Tapping Case: తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం సృష్టిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాజకీయపరమైన వ్యక్తులపై, అధికారులపై, వ్యాపారస్తులపై, వ్యక్తుల వ్యక్తిగత జీవితాల కార్యకలాపాలపై పోలీసు అధికారులు ఒక మాఫియాగా ఏర్పడి ఫోన్ ట్యాపింగ్ చేశారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో బీఆర్ఎస్ పాలనలో ఒక వెలుగు వెలిగిన అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ కార్యకర్తలు, నాయకులు, ఆఫీసు సిబ్బంది ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆధారాలు బయటపడుతున్నాయని అన్నారు. దీనిపై ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా కఠినంగా వ్యవహరించాలని అన్నారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
"రాజ్యాంగం కల్పించిన పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగేలా వ్యవహరించారు. దేశ భద్రత, ఉగ్రవాదుల విషయంలో మాత్రమే ఉన్నతాధికారుల అనుమతులు తీసుకొని ఫోన్ ట్యాపింగ్ చేసే అవకాశం ఉంటుంది. అవినీతి కుంభకోణాలకు పాల్పడటం, వ్యక్తులను బ్లాక్ మెయిల్ చేసి కోట్లాది రూపాయలు వసూలు చేయడం కోసం ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడటం దుర్మార్గం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి బాధ్యత వహించాల్సింది ముఖ్యమంత్రి గారే. దీనిపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నాం. ఎమ్మెల్సీ కవిత గారిని బీజేపీ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే అక్రమ కేసులతో అరెస్ట్ చేశారంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడారు.
ఢిల్లీలో లిక్కర్ వ్యాపారంలో కవిత జోక్యం చేసుకున్నారా లేదా..? కొంతమంది వ్యక్తులతో వ్యాపార సంస్థను ఏర్పాటు చేసి అందులో తన బినామీ మనుషులను పెట్టారా లేదా..? తన కనుసైగల్లో వ్యాపార సంస్థను నడిపిస్తూ.. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వంతో మంతనాలు జరిపారా.. లేదా..? కోట్లాది రూపాయలు చేతులు మారాయా లేదా..? ఈ విషయంపై కేసీఆర్ సమాధానం చెప్పాలి. ఇవన్నీ ఢిల్లీలో జరిగిన ఆప్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిలో భాగమే. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు, తెలంగాణ రాష్ట్రానికి, ప్రజలకు, తెలంగాణణ సెంటిమెంటుకు.. కవిత అరెస్టుకు ఏమాత్రం సంబంధం లేదు. లిక్కర్ స్కాంలో కవిత జోక్యం లేనట్లయితే, ఇది అక్రమ కేసు అయితే, రాజకీయపరమైన కక్షసాధింపు కేసు అయితే.. కేసీఆర్ బహిరంగ చర్చకు వచ్చి నిరూపించుకోవాలి.
కేసీఆర్ కుటుంబం ఇంకా అధికారంలో ఉన్నట్లే భావిస్తున్నారు. బీఆర్ఎస్ నాయకుల కాళ్ల కింద భూమి కదిలిపోతున్నా.. అబద్ధాలు, ఆరోపణలు చేయడం మానలేదు. అబద్ధాలు ఆడటంలో కేసీఆర్ కుటుంబాన్ని మించినవారు లేరు. ప్రజలను మభ్యపెట్టే మాటలతోనే పదేండ్ల పాటు పాలన చేశారు. పదేపదే భారతీయ జనతా పార్టీపై బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా విమర్శలు గుప్పించడం సిగ్గుచేటు. బీజేపీ ని విమర్శిస్తే ఊరుకునేది లేదు. కేసీఆర్ కుటుంబం అవినీతిని ప్రజలు ముందుంచుతాం. లిక్కర్ స్కాంలో కవిత కడిగిన ముత్యంలా తిరిగొస్తామని చెబుతున్నారు.. మరి ఏ రకంగా కడిగిన ముత్యంలా తిరిగివస్తారో తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు.." అని అని కిషన్ రెడ్డి అన్నారు.
Also Read: Whatsapp New Feature: వాట్సప్ AI ఫోటో ఎడిటింగ్ ఫీచర్, ఎలా పనిచేస్తుందంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter