Modi Chant: దేశంలో మోదీ భజన తీవ్రంగా ఉందని.. వ్యక్తిగత పూజ స్థాయికి చేరిందని మేధావులు ఆందోళన చెందుతున్నారు. బీజేపీలాంటి పార్టీలో వ్యక్తిగత ఆరాధన రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సమయంలో ఓ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోసారి ఎవరైనా మోదీ భజన చేస్తే చెంప పగలగొట్టాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో మోదీ పాలనపై తీవ్ర విమర్శలు చేస్తున్న క్రమంలో ఒకడుగు ముందడుగు వేసి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయనే కర్ణాటక మంత్రి శివరాజ్ తంగడిగి.
Also Read: Legal Notice: మీడియా సంస్థలకు కేటీఆర్ భారీ షాక్.. బామ్మర్దితో ఛానల్స్‌కు రూ.160 కోట్ల నోటీసులు
కర్ణాటక కొప్పల్ జిల్లాలోని కరటాగిలో సోమవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రి శివరాజ్ పాల్గొని మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పదేళ్లలో నరేంద్ర మోదీ ఇస్తానన్న 20 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. యువతకు ఉద్యోగాలు కల్పించడంతో మోదీ విఫలమయ్యారని విమర్శించారు. ప్రధానమంత్రిపై ప్రశంసలు కురిపించే యువత చెంప పగలగొట్టాలని పిలుపునిచ్చారు. 'మోదీ మోదీ అని నినాదాలు చేస్తూ ఆయనకు మద్దతిచ్చే యువత సిగ్గుపడాలి' అని చెప్పారు. అబద్దాలు చెప్పి మోదీ అధికారంలోకి వచ్చారని, మరోసారి ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమయ్యారని మండిపడ్డారు. పదేళ్లుగా మోదీ అబద్దాలతో పాలన సాగిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: KT Rama Rao: యూట్యూబ్ ఛానళ్లపై కేటీఆర్ యుద్ధం.. ఇక ఆయా ఛానళ్ల వారికి చుక్కలే
స్మార్ట్‌సిటీల విషయమై స్పందిస్తూ.. 'దేశంలో వంద స్మార్ట్‌సిటీలు ఇస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. కానీ అవి ఎక్కడ ఉన్నాయి? ఒక్కటైనా చెప్పాలి' అని సవాల్ విసిరాడు. ఒక మోదీ వ్యవహార శైలిపై విమర్శలు చేస్తూ 'మోదీ తెలివైనవాడు. మంచి దుస్తులు ధరిస్తాడు. స్మార్ట్ ప్రసంగాలు చేస్తాడు. సముద్ర గర్భంలోకి వెళ్లి పూజలు చేస్తూ స్టంటులు చేస్తాడు. ఇవన్నీ ఒక ప్రధానమంత్రి చేయాల్సిన పని ఇదేనా?' అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు కర్ణాటకలో తీవ్ర దుమారం రేపాయి. మంత్రి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలను బీజేపీ సీనియర్ నాయకుడు అమిత్ మాలవీయ ఖండించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ప్రధానిపై చేసిన వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో బీజేపీ నాయకులు కోరారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook