Weight Loss Drink: బరువు తగ్గించుకునేందుకు చాలామంది చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. కానీ చాలా సందర్భాల్లో ఆశించిన ఫలితాలు దక్కవు. వర్కవుట్స్ చేయడం, డైటింగ్ చేయడం, వ్యాయామం, యోగా, వాకింగ్ ఇలా ఎన్నిచేసినా నిష్ప్రయోజనంగా ఉంటుంది ఒక్కోసారి. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు ఉండవచ్చు.
సాధారణంగా చాలామంది ఆయిలీ ఫుడ్స్, స్వీట్స్ తినడాన్ని ఇష్టపడుతుంటారు. యువత అయితే జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్‌పై మక్కువ చూపిస్తుంటారు. ఫలితంగా బరువు పెరిగిపోతుంటుంది. ఒకసారి బరువు పెరిగిందంటే ఇక నియంత్రణ అనేది చాలా కష్టమైపోతుంది. బిజీ లైఫ్ కారణంగా జిమ్ లేదా వర్కవుట్స్ చేసేందుకు సమయం ఉండకపోవచ్చు. ఆహారపు అలవాట్ల గురించి కూడా అవగాహన ఉండకపోవచ్చు. ఈ పరిస్థితుల్లో ఇంట్లో తయారు చేసుకునే హోమ్ మోడ్ డ్రింక్‌తో అద్భుతాలు చూడవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. చాలా వేగంగా బరువు తగ్గించుకోవచ్చంటున్నారు. బరువు తగ్గించేందుకు వాము నిజంగానే ఓ అద్భుతమైన ఔషధం. ఇందులో ఆయుర్వేద గుణాలు చాలా మెండుగా ఉంటాయి. వాము నీపు తాగడం వల్ల నడుము చుట్టూ ఉండే కొవ్వు వేగంగా కరుగుతుంది.
రోజూ ఉదయం వేళ పరగడుపున వాము నీరు తాగడం అలవాటు చేసుకుంటే బరువు చాలా వేగంగా కరుగుతుంది. బెల్లీ ఫ్యాట్ సమస్య ఉంటే తొలగిపోతుంది. వాము నీటిని గోరువెచ్చగా వేడి చేసి తాగవచ్చు. రోజువారీ డైట్లో వాము నీళ్లను భాగంగా చేసుకుంటే మరింత మెరుగైన ఫలితాలు చూడవచ్చు. బరువు తగ్గించే ప్రక్రియ కోసం 25 గ్రాముల వామును నీట్లో నానబెట్టి రాత్రంతా ఉంచాలి. ఉదయం ఆ నీళ్ళను పరగడుపున తాగాలి.
నెలరోజులు క్రమం తప్పకుండా వాము నీటిని తాగితే మీ శరీరంలో మీకే తెలియని చాలా మార్పులు గమనించవచ్చు. రాత్రి నానబెట్టకపోయినా ఉదయం వాము నీళ్లలో ఉడకబెట్టి చల్లార్చి తాగినా అంతే ఫలితాలుంటాయి. ఇందులో 5-6 తులసి ఆకులు వేస్తే మరింత మంచిది. కేవలం వారాల వ్యవధిలో బరువు తగ్గించుకోవచ్చు.
Also read: Iron Deficiency: శరీరంలో ఐరన్ లోపముందా, ఈ ఐదు పదార్ధాలు తింటే చాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook