కన్నడలో తెరకెక్కిన కేజీఎఫ్ సినిమా తెలుగు వెర్షన్ ట్రైలర్ ఇవాళ విడుదలైంది. కన్నడలో రూపొందిన ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, మళయాళం భాషల్లోనూ విడుదలవనుంది. కేజీఎఫ్ అంటే క్లుప్తంగా కోలార్ గోల్ ఫీల్డ్స్ అని అర్థం. 1951లో ముంబై వీధుల్లో పుట్టిన రాకీ అనే కుర్రాడు నేరాలు చేస్తూ పెరిగి పెద్దవుతాడు. ఆ తర్వాత తన పనిలో భాగంగా ఓసారి కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కి వెళ్తాడు. అక్కడ అతడికి ఎదురైన అనుభవాలు, సవాళ్లు.. అంతకన్నా ముందుగా చిన్నప్పటి నుంచి అతడు నేర్చుకున్న గుణపాఠాల ఆధారంగా ఆ సమస్యలను ఎదుర్కున్న యుద్ధమే ఈ కేజీఎఫ్ సినిమా కథాంశం.
యశ్ అనే నటుడు రాకీ పాత్ర పోషించగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. ప్రశాంత్ నీల్ అనే దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమాను తెలుగులో ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ సమర్పించగా, వారాహి చలన చిత్రం బ్యానర్ తెలుగు ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తుంది.