దేవేగౌడతో చంద్రబాబు భేటీ రహస్యం ఇదే !

                                       

Last Updated : Nov 8, 2018, 02:10 PM IST
దేవేగౌడతో చంద్రబాబు భేటీ రహస్యం ఇదే !

ఏపీ సీఎం చంద్రబాబు ఈ రోజు బెంగళూరులో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన జేడీయు నేత, మాజీ ప్రధాని దేవేగౌడతో పాటు ఆయన కుమారుడు కర్నాటక సీఎం కుమారస్వామితో భేటీ కానున్నారు.  ఇటీవలే జరిగిన ఉప ఎన్నికల్లో జేడీయు-కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో సీఎం కుమార స్వామికి ఈ సందర్భంగా చంద్రబాబు అభినందనలు తెలపనున్నారు. కాగా భేటీలో ప్రధానంగా వచ్చే ఎన్నికల నాటికి బీజేపీకి వ్యతిరేకంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి...ఇందుకు ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి అనే దానిపై చర్చ జరపనున్నారు. అలాగే రాష్ట్రంలో నిర్వహించ తలపెట్టిన బీజేపీ వ్యతిరేక ' ధర్మపోరాట దీక్ష ' సభకు దేవేగౌడ, కుమారస్వామిలకు ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. కాగా వచ్చే వారం డీఎంకే చీఫ్ స్టాలిన్ తో భేటీ కావాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

బీజేపీయేతర పక్షాలను ఏకం చేసే పనిలో చంద్రబాబు

బీజేపీయేతర పక్షాలను ఏకం చేసే తన ప్రయత్నాలను చంద్రబాబు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ అంశంపై రెండు సార్లు ఢిల్లీలో పర్యటించిన చంద్రబాబు బీజేపీని వ్యతిరేకించే పార్టీలకు చెందిన నేతలను కలుసుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు బీఎస్పీ చీఫ్ మాయవతి, ఎస్పీ అభ్యక్షడు అఖిలేష్ యాదవ్ , ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఎల్‌జేడీ చీఫ్ శరద్ యాదవ్, జేఎంఎం చీఫ్ ఒమర్ అబ్దుల్లాతో పాటు ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తదితర నేతలతో వరస భేటీలు నిర్వహించారు. ఈ పర్యటనలో విపక్షాలను ఒక్కతాటిపై తీసుకువచ్చే ప్రయత్నంలో కొంత వరకు సక్సెస్ అయిన చంద్రబాబు.. తాజాగా మాజీ ప్రధాని దేవేగౌడతో భేటీ కావడంపై గమనార్హం. ఈ నేపథ్యంలో రాజకీయ చాణిక్యులుగా ముద్రపడిన చంద్రబాబు-దేవేగౌడల మధ్య జరిగే చర్చపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.
 

Trending News