Arvind Kejriwal: మద్యం కుంభకోణంలో అనూహ్య మలుపు.. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్ట్‌

Arvind Kejriwal Arrested By ED: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల కవిత అరెస్ట్‌ కాగా.. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్ట్‌ అయ్యారు. దీంతో పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు మొదలయ్యాయి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 21, 2024, 09:52 PM IST
Arvind Kejriwal: మద్యం కుంభకోణంలో అనూహ్య మలుపు.. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్ట్‌

Arvind Kejriwal: మద్యం కుంభకోణం కేసు కీలక మలుపు తిరిగింది. కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఎట్టకేలకు అరెస్టయ్యారు. ఈ కుంభకోణంలో విచారణకు హాజరుకావాలని దాదాపు తొమ్మిదిసార్లు నోటీసులు పంపగా.. వాటిని బేఖాతరు చేశారు. విచారణకు రాకుండా ఉండడంతో ఈడీ తీవ్రంగా స్పందించింది. అయితే అరెస్ట్‌ కాకుండా న్యాయ స్థానం ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేయగా కోర్టులో కేజ్రీవాల్‌కు చుక్కెదురైంది. ఇది జరిగిన కొన్ని గంటలకే అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టవడం గమనార్హం.

Also Read: Kavitha Arrest: కవిత అరెస్ట్‌ వెనకాల ఉన్న కథ ఇదే.. ఢిల్లీ కుంభకోణం అంటే ఏమిటి?

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వం కొత్త మద్యం విధానం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ విధానంలో అవకతవకలు జరిగాయని, నచ్చినవారికే మద్యం దుకాణాలు కేటాయించారని, రూ.వందల కోట్లు చేతులు మారాయని ప్రధానంగా ఆరోపణలు వినిపించాయి. ఈ కేసులో తెలుగు రాష్ట్రాలతోపాటు పలువురు ప్రముఖులు భాగస్వాములుగా ఉన్నారని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విచారణలో తేలింది. అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలో మద్యం విధానం తీసుకురావడంతో అతడిని ప్రధాన సూత్రధారిగా ఈడీ గుర్తించింది.

Also Read: Kavitha Arrest: కవితను అరెస్ట్‌ చేసి.. కేటీఆర్‌కు చుక్కలు చూపించిన ఈడీ అధికారిణి ఎవరో తెలుసా? ఆమె జీవిత చరిత్ర ఇదే!

ఈ కుంభకోణం కేసులో విచారణకు హాజరుకావాలని పలుమార్లు కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు పంపింది. అయితే ఆ నోటీసులను అరవింద్‌ కేజ్రీవాల్‌ చిత్తు కాగితాలుగా భావించి విచారణకు హాజరుకావడం లేదు. విచారణకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్న కేజ్రీవాల్‌ను ఎట్టకేలకు ఈడీ అరెస్ట్‌ చేసింది. ఈ కేసులో ఇదే అతి పెద్ద అరెస్ట్‌. కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేసేందుకే కల్వకుంట్ల కవితను అరెస్ట్‌ చేశారని సమాచారం.

అరెస్ట్‌ల పర్వం

  • మద్యం కుంభకోణం కేసులో మొదటి అరెస్ట్‌ ఆప్‌ సీనియర్‌ నాయకుడు, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా మనీశ్‌ సిసోడియా. ఆయన అరెస్ట్‌తో ఈ కేసు ఒక్కసారిగా దేశంలో కలకలం రేపింది.
  • ఈ కేసులో సంబంధాలు ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంపీ కుమారుడు అరెస్టయ్యారు.
  • ఇటీవల వారం కిందట తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ కుమార్తె, బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.
  • కేజ్రీవాల్‌ అరెస్ట్‌తో మద్యం కుంభకోణం కేసు దాదాపుగా ముగిసినట్టే.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News