Oneplus 12R Genshin Impact Edition Price In India: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్‌ప్లస్‌కి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ప్రీమియం ఫీచర్స్‌తో అతి తక్కువ ధరల్లో కంపెనీ కొత్త మొబైల్స్‌ను విక్రయిస్తోంది. ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్ అయిన OnePlus 12R స్మార్ట్‌ఫోన్‌కి మార్కెట్‌లో మంచి ప్రజాదరణ లభించింది. దీనిని దృష్టిలో పెట్టుకుని కంపెనీ గత నెలలో వన్‌ప్లస్ 12R Genshin ఇంపాక్ట్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ మొబైల్ మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ జెన్‌షిన్ ఇంపాక్ట్ గేమ్ థీమ్‌తో మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చిన ఈ మొబైల్.. అమెజాన్ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ రోజు నుంచి విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్ 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌లో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన మరిన్ని వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ వన్‌ప్లస్ 12R Genshin ఇంపాక్ట్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం 16GB ర్యామ్, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన మొబైల్ ధర రూ.49,999లతో లభిస్తోంది. దీంతో పాటు అమోజాన్ ఈ మొబైల్ ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. ముఖ్యంగా దీనిని కొనుగోలు చేసే క్రమంలో వన్‌కార్ట్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లిస్తే దాదాపు రూ. 1,000 తక్షణ బ్యాంక్ తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా మరింత తగ్గింపు పొందాలనుకునేవారు ఎక్స్ఛేంజ్ బోనస్ ఆఫర్‌ను కూడా వినియోగించవచ్చు. ఈ ఆఫర్‌ను వినియోగించి దాదాపు రూ.4,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది.
ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు:
ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ పరంగా ఇంతక ముందు ఉన్న OnePlus 12R మొబైల్‌ను పోలి ఉంటుంది. కాన్నీ కొన్నింటిలో మాత్రం తేడాల ఉంటాయి. ఇక ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. 6.78-అంగుళాల 1.5K డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ స్క్రీన్ 1264x2780 పిక్సెల్ రిజల్యూషన్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ఇది గరిష్టంగా 4500 నిట్‌ల బ్రైట్‌నెస్ సపోర్ట్‌తో లభిస్తోంది. దీంతో పాటు ఇది 2160Hz టచ్ శాంప్లింగ్ రేటును కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ డిప్లేకు సంబంధించిన ప్రోటన్ వివరాల్లోకి వెళితే..ఇది గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రోటన్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు 256 GB UFS 3.1 స్టోరేజ్‌తో అందుబాటులోకి వచ్చింది.
ఈ వన్‌ప్లస్ 12R Genshin ఇంపాక్ట్ ఎడిషన్ మొబైల్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌సెట్‌తో లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాక్ సెటప్‌లో ట్రిపుల్ కెమెరాలు ఉంటాయి. అంతేకాకుండా ఇందులో ప్రధాన కెమెరా 50-మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు 2-మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాలు కూడా అందుబాటులో ఉంటాయి. ఇక ఫ్రంట్ కెమెరా విషయానికొస్తే ఇది 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో అందుబాటులోకి రాబోతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి