Clock vastu Tips: ఇంట్లో గడియారం పొరపాటున కూడా ఈ రంగులో ఉండకూడదు..

Clock vastu Tips: హిందూమతంలో వాస్తుశాస్త్రానికి ప్రత్యేక స్థానం ఉంది. వాస్తు నియమాలు అనుసరించే ఇంట్లో ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు. ఈరోజు వాస్తు ప్రకారం గడియారం ఏ దిశలో ఏర్పాటు చేసుకోవాలో తెలుసుకుందాం.   

Written by - Renuka Godugu | Last Updated : Mar 18, 2024, 04:32 PM IST
Clock vastu Tips: ఇంట్లో గడియారం పొరపాటున కూడా ఈ రంగులో ఉండకూడదు..

Clock vastu Tips: హిందూమతంలో వాస్తుశాస్త్రానికి ప్రత్యేక స్థానం ఉంది. వాస్తు నియమాలు అనుసరించే ఇంట్లో ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు. ఈరోజు వాస్తు ప్రకారం అద్దాన్ని ఏ దిశలో ఏర్పాటు చేసుకోవాలో తెలుసుకుందాం. వాస్తు ప్రకారం గడియారం తప్పు దిశలో ఏర్పాటు చేసుకుంటే ఆ ఇంట్లో వారిని సమస్యల వలయాలు చుట్టుముడతాయి. ఇంటికి నెగిటివిటీ ప్రభావం కూడా పెరిగిపోతుంది. వాస్తు ప్రకారం ఇంట్లో గడియారాన్ని ఈశాన్యంలో ఏర్పాటు చేసుకోవాలని వాస్తు నిపుణులు చెబుతారు. ఈ దిశ ధనాన్ని సూచిస్తుంది. ఇంట్లో ఈ పెట్టుకునే గడియారం వాస్తు ప్రకారం ఏర్పాటు చేసుకుంటే ఆ ఇంటికి సానుకూల శక్తి వస్తుంది. ఇది కాకుండా వ్యతిరేక దిశలో పెట్టుకుంటే నెగిటివిటీ పెరిగిపోతుంది. వాస్తు ప్రకారం మనం వాచ్ ను ఈశాన్య దిశలో ఏర్పాటు చేసుకుంటే ఆ ఇంట్లో నివసించే వారికి పురోగతి ఉంటుంది.

అయితే, వాస్తు ప్రకారం దక్షిణ దిశలో ఇంట్లో గడియారం, అద్దాలు పెట్టకూడదు. ఈ దిశ యమ దిశను సూచిస్తుంది. అంతేకాదు వాస్తు ప్రకారం ఇంట్లో ఉండే గడియారం మెయిన్ డోరో పైన కూడా పెట్టకూడదు. ఇది ఇంట్లో అలజడిని పెంచుతుంది.

ఇదీ చదవండి: Holi 2024: హోలీని ఈ ప్రాంతంలో రంగులతోకాదు.. చితాభస్మంతో ఆడతారు..

వాస్తుప్రకారం మనం ఇంట్లో పెట్టుకునే గడియారం రంగు కూడా ప్రాధాన్యత ఉంది. ఈ గడియారాల రంగు నలుపు, నీలం రంగు లేకుండా జాగ్రత్త పడాలి. దీంతో ఇంట్లో నెగిటివిటీ పెరిగిపోతుంది. అయితే గడియారం ఉత్తర దిశలో పెట్టుకోవచ్చు ఇది కాకుండా మరో దిశ అంటే తూర్పు దిశ. ముఖ్యంగా ఉత్తర దిశ కుబేరుని సూచిస్తుంది. మీరు ఇంట్లో గడియారం పెట్టుకుంటే ఈ రెండు దిశల్లో ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే ఈ గడియారం విరగకుండా జాగ్రత్తపడాలి. ఎందుకంటే వాస్తులో ఇంట్లో పెట్టుకునే ఏ వస్తువులు కూడా విరగకుండా జాగ్రత్తపడాలి. ఇవి ఇంట్లో నెగిటివిటీని పెంచుతాయి. 

ఇదీ చదవండి: Tirumala: భక్తులకు అలర్ట్‌.. ఎన్నికల వేళ ఈ విషయం తెలుసుకుని తిరుమల వెళ్లండి

అంతేకాదు వాస్తు ప్రకారం మనం ఇంట్లో ఏర్పాటు చేసుకునే గడియారం ఆకృతి కూడా ముఖ్యం. సాధారణంగా మన అందరి ఇళ్లలో వృత్తాకారంలో ఉంటుంది. దీర్ఘచతురస్రాకారంలో కొన్ని గడియారాలు కూడా ఉంటాయి. ఇవి కాకుండా కేవలం రౌండ్ షేపులో ఉండే గడియారాలనే ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు రకరకాల రంగులు, షేపుల్లో గడియారాలు వస్తున్నాయి. వాస్తు ప్రకారం ఉదయం లేచిన వెంటనే కూడా గడియారం చూడకూడదు. ముందుగా చేతి రేఖలను చూసిన తర్వాతే ఇతర వస్తువులను చూడాలి. అంతేకాదు ఉదయం నిద్ర లేచిన వెంటనే అద్దం కూడా చూసుకోకూడదని వాస్తు పండితులు చెబుతారు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.) 
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News